చిరుధాన్యాలతో టిఫిన్స్
కోరుట్ల: స్థానిక కొత్త మున్సిపల్ వద్ద అంగ రాజేందర్ చిరుధాన్యాల టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేశాడు. నిత్యం ఉదయం 6 గంటల నుంచి రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్నలతో చేసిన టిఫిన్స్ విక్రయిస్తున్నాడు. కల్తీ లేకపోవడం, ఆరోగ్యదాయకం కావడంతో చాలామంది ఇక్కడికి వచ్చి, టిఫిన్ చేస్తున్నారు. రాగులు, సజ్జల్లో జీవక్రియలకు ఉపయోగపడే ఐరన్, మెగ్నీషియం, జింక్, కాల్షియం ఉంటాయని, తన భార్య కళావతితో కలిసి నిత్యం టిఫిన్స్ తయారు చేస్తున్నట్లు రాజేందర్ తెలిపాడు. సాధారణ టిఫిన్ల ధరనే తీసుకుంటుండంతో ఎక్కువ మంది వస్తున్నారని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment