No Headline
జగిత్యాల అగ్రికల్చర్: చిరుధాన్యాలతో తయా రు చేసిన అంబలికి రోజురోజుకూ ప్రాధాన్యత పెరుగుతోంది. ఇది గమనించిన జగిత్యాలకు చెందిన రాపర్తి మహేశ్ స్థానిక మినిస్టేడియం వద్ద నాలుగేళ్లుగా రాగి అంబలి గ్లాస్ రూ.10కే విక్రయిస్తున్నాడు. వాకర్స్‌తోపాటు కూరగా యల మార్కెట్‌కు వచ్చే రైతులు కొనుగోలు చేస్తున్నారు. అంబలిలో నిమ్మకాయ రసం, ఎల్లిపాయ కారం, మిరియాల పొడి, క్యారెట్, పెసర మొలకలు వేసి ఇస్తుండటంతో చాలా మంది ఇంటికి కూడా తీసుకెళ్తున్నారు. కరోనా కాలం నుంచి అంబలి అమ్ముతూ పుపాధి పొందుతున్నట్లు మహేశ్ తెలిపాడు.
జమ్మికుంట(హుజూరాబాద్): జమ్మికుంటకు చెందిన గుజ్జ హరీశ్‌రావు స్థానికంగా నృసింహ మిల్లెట్ మార్ట్‌ను ప్రారంభించాడు. చిరుధాన్యాలైన అరికలు, ఉదలు, సామలు, కొర్రలు, అండుకొర్రలతో జావ, రాగి అన్నం, చపాతి, పచ్చజొన్న, గటుక, బటర్ మిల్క్, లస్సీ, మిల్క్‌షేక్, అంబలి తయారు చేసి, విక్రయిస్తున్నాడు. ఇవి కేన్సర్, డయాబెటిస్, నీరసం, బీపీ, ఫ్యాట్, కడుపులో మంటను అదుపులో ఉంచుతాయి. ఖాదర్ వలీ అనే ప్రైవేట్ సైంటిస్ట్ ఆరోగ్య సూత్రాలను ఆదర్శంగా తీసుకొని, 6 నెలల క్రితం ఈ మార్ట్ ఏర్పాటు చేశానని, ఖర్చులన్నీ పోను నెలకు రూ.30 వేల వరకు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నాడు.
ఆ
మిల్లెట్ మార్ట్
రాగి అంబలి..
Comments
Please login to add a commentAdd a comment