తగ్గేదేలే...
సిరిసిల్లటౌన్: చిన్ననాడు మొదలెట్టిన పరుగు.. ఏడు పదుల వయస్సులో కూడా ఆగడం లేదు. బరిలో దిగితే పతకం ఖాయం. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో రికార్డులు ఆమె సొంతం. వెట‘రన్’గా ఇంటర్నేషనల్ స్థాయిలో గోల్డ్‌మెడల్స్ సాధిస్తూ.. అథ్లెటిక్స్‌లో చిన్నప్పటి ఆశయాలు నెరవేర్చుకుంటూ..నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుంది సిరిసిల్లకు చెందిన టముటం రామానుజమ్మ. హైస్కూల్ స్థాయిలో పరుగు పందేళ్లో పతకాలు సాధించింది. తర్వాత వైవాహిక జీవితంతో కొంతకాలం గ్యాప్ రాగా, 1995 నుంచి వెటరన్ అథ్లెట్స్‌లో పాల్గొనడం మొదలుపెట్టింది. 1996లో కరీంనగర్‌లో రాష్ట్రస్థాయిలో స్వర్ణం, 1997లో కొత్తగూడెంలో ఏపీ వెటరన్ ఆమెచ్యూర్ అథ్లెటిక్స్‌లో రజతం, 1998, 1999లో వరుసగా బంగారు పతకాలు సాధించింది. 2000 సంవత్సరంలో హైదరాబాద్‌లో జరిగిన ఓపెన్ వెటరన్ అథ్లెటిక్ మీట్, 2001లో వరంగల్‌లో జరిగిన 400 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకాలు సాధించింది. 2004–05లో హైదరాబాద్‌లో జరిగిన జాతీయ పోటీల్లో రెండుసార్లు ప్రథమస్థానంలో నిలిచింది. 2007లో వరంగల్, 2012లో విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో మొదటి బహుమతులు సాధించింది. ఏడుపదుల వయస్సులో ఇప్పటి వరకు పాతికేళ్లుగా పరుగుపందెం, జావలింగ్ త్రో, షాట్‌పుట్ క్రీడల్లో 60 బంగారు, 44 వెండి పతకాలు, ప్రశంసాపత్రాలు, నగదు పురస్కారాలు అందుకుంది. భారత్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల అయోధ్యలో జరిగిన డైబ్బె ఏళ్ల విభాగంలో 1,500, 800 మీటర్ల పరుగు పందెంలలో రెండు మెడల్స్ సాధించింది. అలాగే సౌత్ ఏషియన్ మాస్టర్స్ అథ్లెట్స్ ఓపెన్ చాంపియన్ షిప్ పోటీల్లో డైబ్బె ఏళ్ల విభాగంలో 800 మీటర్ల పరుగు పందెంలో మూడో స్థానంలో నిలిచింది. 2019లో తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ శ్రీవయో శ్రేష్ట సమ్మన్‌శ్రీ అవార్డు అందజేసింది. ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించేలా జీవితకాలం పరుగుల్లో రాణిస్తానని రామానుజమ్మ పేర్కొన్నారు. – వివరాలు 8లోu
Comments
Please login to add a commentAdd a comment