‘ఉపాధి’లో వెలుగు చూసిన అక్రమాలు
మల్యాల: మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో శనివారం 15వ విడత ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. 2023 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2024 మార్చి 31 వరకు మండలంలోని వివిధ గ్రామాల్లో చేపట్టి పనుల వివరాలు వెల్లడించారు. మొత్తం 319 పనులు చేపట్టి రూ.7,78,14,809 నిధులు కేటాయించారు. పనుల రికార్డుల నిర్వహణ, హరితహారం మొక్కల సంరక్షణపై పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నీకల్ అసిస్టెంట్ల నిర్లక్ష్యం వహించినందుకు వారి నుంచి రూ.25,390 రికవరీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి రూ.7,433, పంచాయతీ కార్యదర్శులు రూ.14,957, టెక్నికల్ అసిస్టెంట్ల నుంచి రూ.మూడువేల రికవరీకి ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీవో మదన్‌మోహన్, అసిస్టెంట్ డీఈఓ దేవేందర్ రెడ్డి, ఎంపీడీఓ స్వాతి, ఎంపీఓ ప్రవీణ్, ఏపీఓ శ్రీనివాస్, ఈజీఎస్ ఈసీ మనోజ్, సోషల్ ఆడిట్ ఎస్టీఎం అంజాద్ అలీ, ఎస్‌ఆర్పీ సుశీల, టీఏ జలపతి, లావణ్య పాల్గొన్నారు.
ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్‌రావు
కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు అంజన్న ఆలయ ఈవోగా శ్రీకాంత్‌రావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన రామకృష్ణారావు హైదరాబాద్‌కు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో వేములవాడ ఈవోకు అదనపు బాధ్యతలు అప్పగించారు. అనంతరం జరిగిన పరిణా మాల నేపథ్యంలో శ్రీకాంత్‌రావును పూర్తిస్థాయి ఈవోగా నియమించారు. ఈ మేరకు ఆయన శనివారం స్వామివారిని దర్శించుకున్నారు. లడ్డూ తయారీ కేంద్రం, కౌంటర్ నిర్వహణ, క్యూ లైన్లలో భక్తుల సౌకర్యాలను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment