ఆర్థిక వివరాలు చెప్పాలి
పిల్లలు అడిగినవన్నీ కొనివ్వడం వంటి అతి గారాబం చేయడం మంచిది కాదు. ఖర్చుపెట్టే స్థోమత ఉన్నప్పటికీ డబ్బు విలువ తెలిసేలా విలువలు నేర్పించాలి. పిల్లలు ప్రతీ విషయాన్ని ఈజీగా తీసుకోకుండా ఆలోచన విధానం మార్చాలి. ఫైనాన్స్ డిసిప్లేన్ నేర్పిస్తే వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసినట్లే.
– మార్కొండ శకుంతల,
అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎకనామిక్స్
చాలెంజ్‌గా మారింది
తల్లిదండ్రులు పిల్లలపై అతిగా స్పందించవద్దు. పిల్లలు చాలా తెలివిగా వ్యవహరిస్తారు. తల్లిదండ్రులు ఏవిధంగానైతే వారు చెప్పినట్లు వింటారో అదే ధోరణిని పాటిస్తారు. పిల్లల మానసిక ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. చిన్న వస్తువులను దక్కించుకునేందుకు వారు మొండిగా వ్యవహరిస్తున్నారంటే పెద్దయ్యాక అలాగే ప్రవర్తిస్తారు. అతిగా ప్రవర్తించే పిల్లల విషయంలో అవసరమైతే కౌన్సెలింగ్ తీసుకోవాలి.
– ప్రవీణ్‌కుమార్ మన్నా, సైకియాట్రిస్టు
మొండితనంగా మారుతుంది
పిల్లలను గారాబం చేయడం వల్ల వారిలో మొండితనం పెరుగుతుంది. అవసరానికి మించిన డబ్బులు ఇస్తూ వారిని తల్లిదండ్రులే దారితప్పేలా చేయడం సరికాదు. పిల్లలతో స్నేహంగా ఉంటూనే వారిని గమనిస్తూ ఉండాలి. వారుచేసే తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ ఇది సరైనది కాదని చెప్పగలిగితే వారి క్రమశిక్షణ అలవాటు చేసుకుంటారు.
– త్రివేణి, పేరెంట్, కరీంనగర్
Comments
Please login to add a commentAdd a comment