ఉత్సాహంగా ‘డైట్’ పండుగ
స్టేషన్‌ఘన్‌పూర్/జఫర్‌గఢ్/ పాలకుర్తి టౌన్/జనగామ రూరల్ : ప్రభుత్వ గురుకులాలు, సంక్షే మ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం పౌష్టికహారం అందించేందుకు డైట్, కాస్మొటిక్స్ చార్జీలు పెంచింది. శనివారం నుంచి కామన్ మెనూ అమలు సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నూతన ‘డైట్’ పండుగను వేడుకగా నిర్వహించారు. కార్యక్రమానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆహ్వా నించగా.. ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా అధికారులు పాల్గొని సహపంక్తి భోజనాలు చేశారు.
జఫర్‌గఢ్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో కలెక్టర్ రిజ్వాన్ బాషాతో కలసి ఎమ్మె ల్యే కడియం శ్రీహరి నూతన మెనూ ప్రారంభించా రు. ప్రిన్సిపాల్ వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రోజూ మెనూ ప్రకా రం విద్యార్థులకు భోజనం అందేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ చాలా ఏళ్ల తర్వాత డైట్, కాస్మొటిక్ చార్జీలు పెరిగాయని చెప్పారు. ఆర్డీఓ వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్యశిరీష్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ కర్ణాకర్‌రావు, వైస్ చైర్మన్ ఐలయ్య, డైరెక్టర్ అయేషాబేగం పాల్గొన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలిగొండ జీపీ పరిధి టీజీఎంఆర్ ఈఐఎస్ పాఠశాల, జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్‌బాషా, ప్రిన్సిపాల్ మాధవీలత, టీచర్లు పాల్గొన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పీఆర్, ఆర్‌డీ స్పెషల్ కమిషన్ షఫీఉల్లా పాల్గొన్నారు. డీఆర్‌డీఓ వసంత, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాములు, ప్రిన్సి పాల్ స్వరూప హాజరయ్యారు. జనగామ జిల్లా కేంద్ర కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్రనాయక్ పాల్గొన్నారు. డీటీ రాజేశ్వర్‌రెడ్డి నూతన మెనూ ప్రారంభించారు. మైనార్టీ కళాశాల ప్రిన్సిపల్ పి.అనిల్‌బాబు, సీఐ దామోదర్‌రెడ్డి, ఎస్సై రాజేష్ కళాశాల కోఆర్డినేటర్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో
సహపంక్తి భోజనాలు
హాజరైన ప్రజాప్రతినిధులు,
రాష్ట్ర, జిల్లా అధికారులు
Comments
Please login to add a commentAdd a comment