రాజీ పడితేనే కేసుల పరిష్కారం సులువు
జనగామ రూరల్: పంతాలు, పట్టింపులకు పోకుండా కక్షిదారులు రాజీపడితేనే కేసులు సులువుగా పరిష్కారం అవుతాయని జిల్లా జడ్జి డి.రవీంద్ర శర్మ అన్నారు. శనివారం కోర్టు ప్రాంగణంలో ఆరు బెంచ్‌ల ద్వారా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులు కూడా పరిష్కారం అయ్యాయని పేర్కొన్నారు. చిన్ని చిన్న తగాదాలకు కోర్టు చుట్టూ తిరగకుండా గ్రామంలోనే పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్‌లో సివిల్ కేసులు 322, క్రిమినల్ 3,022, ప్రీ లిటిగేషన్ 1,648 మొత్తం 4,992 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. ఈ కేసుల ద్వారా రూ.1,03,94,617 చెల్లింపులు జరిగాయని వివరించారు. మోటారు యాక్సిడెంట్ కేసులో మహ్మద్ రఫీకి, ప్రీలిటిగేషన్ కేసులో బానోత్ తిరుపతికి అవార్డు అందజేశారు. అనంత రం లోక్ అదాలత్‌కు వచ్చిన వారికి భోజనం ఏర్పా టు చేశారు. మొదటి బెంచ్ జడ్జి రవీందర్ శర్మ, మెంబర్ కె.చంద్రశేఖర్, రెండో బెంచ్ సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్, సీహెచ్.కిరణ్‌కుమార్, మూడో బెంచ్ సీనియర్ సివిల్ జడ్జి ఇ.సుచరిత, ఎన్.సంధ్యారాణి, నాలుగో బెంచ్ జూనియర్ సివిల్ జడ్జి ఎ.శశి, కె.కవిత, ఐదో బెంచ్ కె.సందీప, జి.రేఖ ఆరవ బెంచ్ స్పెష ల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ డి.వెంకట్రామ్ నరసయ్య కేసులను పరిష్కరించారు.
జిల్లా జడ్జి రవీంద్ర శర్మ
జాతీయ లోక్ అదాలత్‌లో
4,992 కేసుల పరిష్కారం
Comments
Please login to add a commentAdd a comment