జనగామ: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ జిల్లా కమిటీని శనివారం పట్టణంలో రాష్ట్ర అధ్యక్షుడు కొండమల్ల రవి ఆధ్వర్యాన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మత్తపెల్లి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా మహ్మద్ ఖదీర్‌ఖాన్, గుజ్జు రవీందర్, చింతల రవీందర్, ప్రధాన కార్యదర్శిగా మామిడాల కిశోర్, కోశాధికారిగా కాశర్ల రాజు, ప్రచార కార్యదర్శి తమ్మడి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా సింగారం సాయిబాబా, రాజిడి ఉమ, సోల అశోక్, కార్యవర్గ సభ్యులుగా కల్లాటి యాదయ్య, గాంధీ, వాసం వెంకటేశ్వర్లు, మహ్మద్ అజీమొద్దీన్ ఎంపికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment