నేటినుంచి గ్రూప్–2 పరీక్షలు
జనగామ: గ్రూప్–2 పరీక్షల నిర్వహణకు జిల్లా అధి కార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా నేతృత్వంలో డీసీసీ రాజమహేంద్రనాయక్ ఆధ్వర్యాన ఆయా శాఖల ఉన్నతాధికా రులు, పోలీసులు పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై వారం రోజులుగా పని చేస్తున్నారు. 15, 16 తేదీల్లో(నేడు, రేపు) రోజుకు రెండు సెషన్లలో జరిగే గ్రూప్ –2 పరీక్షలకు 5,470 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఇందుకు జిల్లా కేంద్రంలో 16 సెంట ర్లు ఏర్పాటు చేశారు. పేపర్–1 పరీక్ష ఉదయం 10 నుంచి 12.30, పేపర్–2 మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు ఉంటుంది. నిర్దేశిత సమయానికి అరగంట ముందే సెంటర్ల గేట్లు క్లోజ్ చేయనున్నారు. అభ్యర్థులు సెంటర్‌లోకి వెళ్లగానే బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లకు అనుమతి లేదు. తాత్కాలిక టాటూస్, బంగారు ఆభరణాలు, చేతులకు మెహందీ, కాళ్లకు బూట్లు ఉంటే అభ్యంతరం తెలుపుతారు. పరీక్షల సమయంలో సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. సమీప జిరాక్స్ సెంటర్లను మూ సివేయాలని కలెక్టర్ ఆదేశించారు. అభ్యర్థులు హాల్ టికెట్, గుర్తింపు పొందిన ప్రభుత్వ ఐడీ కార్డు తప్పనిసరిగా తెచ్చుకోవాలి. టీజీపీఎస్సీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్‌ను ఏ4 సైజ్ పేపర్‌లో కలర్ ప్రింట్ తీసుకుని దానిపై తాజా పాస్‌పోర్టు ఫొటో అతికించాలి. హాల్‌టికెట్‌పై ఫొటో సరిగా లేకుంటే గెజిటెడ్ అధికారి లేదా చివరగా చదువుకున్న విద్యాసంస్థ ప్రిన్సిపాల్ అటెస్ట్‌తో మూడు పాస్‌పోర్టు ఫొటోలు, వెబ్‌సైట్‌లో పొందుపరిచిన ధ్రువీకరణ పత్రంపై సంతకం చేయించి తీసుకురా వాలి. సందేహాలు ఉంటే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన 9052308621 టోల్ ఫ్రీ నంబర్‌లో సంప్రదించాలి. ఇదిలా ఉండగా ఏకశిల పబ్లిక్ స్కూల్, ఏకశి ల బీఈడీ కాలేజీ, ఏకశిల డిగ్రీ కాలేజీ పేర్లు ఒకేలా ఉండడం వల్ల అభ్యర్థులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. సెంటర్ కోడ్ నంబర్ ఆధారంగా సెంటర్‌కు చేరాలని అధికారులు సూచించారు.
ఎగ్జామ్ సెంటర్ల పరిశీలన
గ్రూప్–2 పరీక్షల నేపథ్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా శనివారం పలు ఎగ్జామ్ సెంటర్లను తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు.
5,470 మంది అభ్యర్థులు, 16 సెంటర్లు
పరీక్ష ప్రారంభానికి అరగంట
ముందే గేట్లు క్లోజ్..
Comments
Please login to add a commentAdd a comment