మీసేవ నిర్వాహకులు ఏకం కావాలి
జనగామ: న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి మీసేవ నిర్వాహకులు ఏకం కావాలని తెలంగాణ మీసేవ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బైరి శంకర్ అన్నారు. జిల్లా కేంద్రం బతుకమ్మకుంటలోని వైఎస్సార్ భవన్‌లో శనివా రం ఊరడి సతీష్ అధ్యక్షతన జరిగిన ఫెడరేషన్ జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం మీసేవ నిర్వహణ భారంగా మారింద ని, రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి సానుకూల వాతావరణంలో సమస్య లు పరిష్కరించే దిశగా ఫెడరేషన్ అండగా ఉంటుందని చెప్పారు. మారిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నిర్వాహకులు అప్‌గ్రేడ్ కావాలే తప్ప ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ సేవలందిస్తున్న మీసేవ యజమానులకు సర్కారు ప్రోత్సాహకాలు అందించే దిశగా కొత్త ఆవిష్కరణలు చేపట్ట బోతున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాధిక్, ఉపాధ్యక్షుడు ఎర్రోళ్ల బాల్‌రాజు, లీగల్ అడ్వైజర్ ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment