అర్హులకు సంక్షేమ పథకాలు అందాలి
జనగామ/చిల్పూరు/స్టేషన్‌ఘన్‌పూర్ : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం జనగామ మున్సిపాలిటీ పరిధి కురుమవాడ, బాలాజీనగర్, చిల్పూరు మండల పరిధి చిన్నపెండ్యాల, స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలో కొనసాగుతున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వే ప్రక్రియలో ఎలాంటి తప్పులు ఉండకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. కుటుంబాల సమగ్ర వివరాలను సేకరించి ఫార్మెట్ ప్రకారం నమోదు చేయాలని చెప్పా రు. పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసాకు సంబంధించి సాగుకు యోగ్యమైన భూములను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని, నాలా కన్వర్షన్, గుట్టలు, రాళ్లు, రప్పలతో సేద్యాని కి అనుకూలంగా లేని భూములను గుర్తించాలని చెప్పారు. ఎవరి వత్తిళ్లకు లొంగొద్దని, పూర్తి వివరా లు సేకరించాలని సూచించారు. అర్హులుకాని చాలా మందికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, దీంతో అసలైన వారికి న్యాయం జరగడం లేదన్న కలెక్ట ర్.. సర్వే సమగ్రంగా చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, వార్డు ఆఫీసర్లు మల్లిగారి మధు, రవి, ఆర్డీఓ వెంక న్న, మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
సర్వే పారదర్శకంగా చేపట్టాలి:
ఆర్‌ఎన్‌ఆర్ కమిషనర్ వినయ్‌కృష్ణారెడ్డి
పాలకుర్తిటౌన్/కొండకండ్ల: సంక్షేమ పథకాల లబ్ధికి అర్హుల గుర్తింపు సర్వే పారదర్శకంగా చేపట్టాలని ఆర్‌ఎన్‌ఆర్ కమిషనర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నా రు. పాలకురి మండల కేంద్రం, కొడకండ్ల మండల పరిధి లక్ష్మక్కపల్లిలో నిర్వహిస్తున్న సర్వేను శుక్రవా రం అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రభుత్వం అమలు చేయనుందన్నారు. డీఆర్‌డీఓ వసంత, డీఎస్‌ఓ సరస్వతి, తహసీల్దారు శ్రీనివాస్, ఎంపీడీ ఓ రాములు, హౌసింగ్ డీఈ సాయిరామ్‌రెడ్డి, ఆర్‌ఐ రాకేష్, ఎంపీఓ రవీందర్‌లు పాల్గొన్నారు.
కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా
Comments
Please login to add a commentAdd a comment