స్థానిక పోరులో కాంగ్రెస్ జెండా ఎగరాలి
రఘునాథపల్లి: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి.. ఈ మేరకు నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం నిడిగొండ సత్యసాయి గార్డెన్స్‌లో మండల అధ్యక్షుడు కోళ్ల రవిగౌడ్ అధ్యక్షతన జరిగిన పార్టీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 26 నుంచి నాలుగు సంక్షేమ పథకాలు అమలులోకి రానున్నాయని, లబ్ధిదారుల ఎంపికలో నాయకులు, కార్యకర్తలు కీలకంగా వ్యవహరించాలన్నారు. ఇంటిగ్రేటెడ్ డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం, 100 పడకల ఆస్పత్రి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్, డిగ్రీ కళాశాల మంజూరు చేయించానని, ఈ పనులకు సీఎం రేవంత్‌రెడ్డి ఫిబ్రవరి రెండో వారంలో శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఎంపీ కావ్య మాట్లాడు తూ.. బీజేపీ–బీఆర్‌ఎస్ మధ్య జైలు, బెయిల్ బంధం కొనసాగుతున్నదని, ఈ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దెబ్బతీయటానికి ప్రయత్ని స్తున్నాయని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఎప్పటికప్పు డు తిప్పి కొట్టాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్లు శివరాజ్‌యాదవ్, లావణ్య, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్‌చందర్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు బడిక ఇందిర, గుడి వంశీధర్‌రెడ్డి, క్రాంతికుమార్, గంగిడి నర్సింహారెడ్డి, చీమలపాటి రవీందర్‌జీ, లింగాజీ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య
Comments
Please login to add a commentAdd a comment