టెన్త్‌లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
● ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా
కాజీపేట అర్బన్: పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఐటీడీఏ ఏటూరునాగారం ప్రాజెక్ట్ అధికారి చిత్రామిశ్రా అన్నారు. హనుమకొండ జిల్లాలోని గిరిజన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస ర్లు, హెడ్‌మాస్టర్లు, ప్రిన్సిపాళ్లతో సమీక్ష నిర్వహించారు. పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయడానికి సూచనలిచ్చారు. అనంతరం హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యల పరిష్కారా నికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి చిత్రామిశ్రా చెప్పారు. కార్యక్రమంలో ఆయా జిల్లాల ఆర్‌సీఓలు, ఏసీఎంలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment