క్రీడాకారులు స్ఫూర్తిగా నిలవాలి
● సీపీ అంబర్ కిషోర్ ఝా
● పోలీస్ క్రీడా పోటీలు ప్రారంభం
వరంగల్ క్రైం: పోలీస్‌లు క్రీడల్లో రాణించి స్ఫూర్తిగా నిలవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. హనుమకొండ జేఎన్‌ఎస్‌లో కమిషనరేట్ మూడో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–25 క్రీడా పోటీలు శుక్రవారం మొదలయ్యాయి. ఈ సందర్భంగా పురుషులు, మహిళలకు 800 వందల మీటర్ల పరుగు, వాలీబాల్ పోటీలను ప్రారంభించి న అనంతరం సీపీ మాట్లాడారు. మూడురోజుల పాటు నిర్వహించే ఈక్రీడల్లో కమిషనరేట్‌కు సంబంధించి మూడు జోన్లతో పాటు మొత్తం ఆరు జట్లు 12 క్రీడాంశాల్లో పోటీ పడతాయన్నారు. ప్రతిభ కనబ ర్చిన వారు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ప్రతిభ కనబర్చడం ముఖ్యమన్నా రు. క్రీడల ద్వారా శారీరక దారుఢ్యం పెరగడంతో పాటు, పని ఒత్తిడిని అధిగమించి ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీలు రవీందర్, రాజమహేంద్రనాయక్, అదనపు డీసీపీలు రవి, సురేశ్‌కుమార్, జనగామ ఏఎస్పీ పండరీ చేతన్ నితిన్, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐ లు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment