ప్రజారోగ్య సంరక్షణే ప్రభుత్వ ధ్యేయం
స్టేషన్‌ఘన్‌పూర్: ప్రజారోగ్య సంరక్షణే ప్రభుత్వ ధ్యేయం.. ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది అందుబా టులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్‌బాషా అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఓపీ, ఐపీ, ఏఎన్‌సీ వార్డులను పరిశీలించారు. రోగులకు కల్పిస్తున్న సదుపాయాలు, సేవలు, వైద్యులు, సిబ్బంది హాజరు వివరాలు తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడిన ఆయన మందులు, భోజనం, ల్యాబ్ టెస్టులపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల ని, నిత్యం ఫాగింగ్ చేయించాలని అధికారులను ఆదేశించారు. ఓపీ సేవలను మరింత పెంచాలని, యాంటీ బయాటిక్స్, కుక్కకాటు, పాముకాటు మందులు అందుబాటులో ఉంచాలని చెప్పారు. నవజాత శిశువుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలన్నారు. డీపీఓ స్వరూపరాణి, ఆర్‌డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ విజయశ్రీ, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంధ్య, డాక్టర్లు ప్రదీప్, రవి, సౌఖ్య, జనార్ధన్, అజయ్ పాల్గొన్నారు.
కలెక్టర్ షేక్ రిజ్వాన్‌బాషా
Comments
Please login to add a commentAdd a comment