పాడి పరిశ్రమ అభివృద్ధికి సర్కారు అండ
జనగామ రూరల్: పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ అన్నారు. శుక్రవారం శామీర్‌పేటలో ఏర్పాటు చేసిన పశువులకు ఉచిత గర్భకోశవ్యాధుల చికిత్స శిబిరంలో ఆయన మాట్లాడుతూ.. ఈ శిబిరాలను పాడి రైతులు సద్వినియో గం చేసుకుని పశు సంపద పెంచుకోవాలని కోరా రు. గ్రామాల్లో సంప్రదాయ పంటలతోపాటు పశు పోషణపై దృష్టి సాధించాలని చెప్పారు. శిబిరానికి 60 పశువులు రాగా డాక్టర్ సీహెచ్.శ్రీకాంత్ గర్భకోశ వ్యాధుల నిర్ధారణ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అలాగే 40 దూడలకు నట్టల నివారణ మందులు అందజేశారు. పశుగణాభివృద్ధి సంస్థ సూపర్‌వైజర్ ఎ.జయపాల్‌రెడ్డి, జేవీఓ రాజ య్య, గోపాలమిత్రులు ఎం.హరి, వై.హరిబాబు, సీహెచ్.నాగరాజు, బనుక భిక్షపతి, తాండ్ర రాములు, రాజు, ఉమేష్, సుధాకర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్
Comments
Please login to add a commentAdd a comment