నల్లా నీటిని పొదుపుగా వాడుకోవాలి | Sakshi
Sakshi News home page

నల్లా నీటిని పొదుపుగా వాడుకోవాలి

Published Fri, Apr 19 2024 1:45 AM

- - Sakshi

భూపాలపల్లి రూరల్‌: భూపాలపల్లి పట్టణ ప్రజలు నల్లా నీటిని పొదుపుగా వాడుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ రాజేశ్వర్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నీటిని వృథా చేయవద్దని, నీరు సరిపోయిన తర్వాత నల్లాలను కట్టి వేయాలన్నారు. నల్లాలకు మోటర్స్‌ పెట్టకూడదన్నారు. నిర్లక్ష్యం వహించి మోటర్లు పెడితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గంజాయి జోలికెళ్తే రౌడీషీట్‌

కాటారం: గంజాయి, మారక ద్రవ్యాల జోలికి వెళ్తే రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తామని కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి హెచ్చరించారు. గంజాయి కేసుల్లో నిందితులకు మండలకేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో గురువారం డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, సీఐ నాగార్జునరావు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. గంజాయి విక్ర యం, సేవించడం, రవాణాకు పాల్పడితే కఠినచర్యలు తప్పవన్నారు. గంజాయిపై నిరంతరం పోలీసుల నిఘా ఉంటుందని చెప్పారు. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నట్లు పేర్కొన్నారు. గంజాయి నిర్మూలన ప్రతి ఒక్క రి బాధ్యతగా భావించి పోలీసులకు సమాచా రం అందించాలని డీఎస్పీ కోరారు. ఈ సమావేశంలో ఎస్సైలు అభినవ్‌, నరేష్‌ పాల్గొన్నారు.

మహాసభను

విజయవంతం చేయాలి

భూపాలపల్లి అర్బన్‌: ఈ నెల 21వ తేదీన గోదావరిఖనిలో నిర్వహించనున్న ఐఎన్‌టీయూసీ మహాసభలను విజయవంతం చేయాలని యూనియన్‌ బ్రాంచీ ఉపాధ్యక్షుడు జోగు బుచ్చయ్య తెలిపారు. యూనియన్‌ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏరియాలోని కార్మికులు, కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు రాజేందర్‌, వేణుగోపాల్‌, రఘుపతిరెడ్డి, అశోక్‌, సంపత్‌రావు, సమ్మిరెడ్డి పాల్గొన్నారు.

గని కార్మికుల

సమస్యలు పరిష్కరించాలి

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి ఏరియాలోని వివిధ గనుల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ఏరియా ఉపాధ్యక్షుడు దాసరి జనార్దన్‌ డిమాండ్‌ చేశారు. ఏరియాలోని యూనియన్‌ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 5వ గనిలో మ్యాన్‌రైడింగ్‌ సరిగా పని చేయడం లేదన్నారు. 150 కుర్చీలు ఉండాల్సి ఉండగా.. కేవలం 20 కుర్చీలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. క్యాంటీన్‌లో సమయపాలన పాటించడం లేదని చెప్పారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. ఎండ తీవ్రత పెరిగినప్పటికీ చల్లటి తాగునీటికి అందించడం లేదని ఆరోపించారు. ప్రశ్నించిన కార్మికులను సస్పెండ్‌ చేస్తూ చార్జీిషీట్లు జారీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో నాయకులు కాసర్ల ప్రసాద్‌రెడ్డి, శ్రీనివాస్‌, కలికొటి లింగయ్య, రాళ్లబండి బాబు, శ్రీధర్‌ పాల్గొన్నారు.

విద్యార్థులకు మెరుగైన

సౌకర్యాలు కల్పించాలి

వెంకటాపురం(కె): విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్‌ పోచం అన్నారు. మండల పరిధిలోని ఆలుబాక, వెంకటా పురం ఎస్టీ బాలుర వసతి గృహాలను, చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలను ఆయన గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వసతి గృహాల్లో ఉన్న బాత్‌ రూమ్‌లు, తాగునీటి సౌకర్యం తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం వి ద్యార్థుల హాజరు పట్టిక, రికార్డులను తనిఖీ చేశా రు. స్టోర్‌ రూమ్‌లో ఉన్న స్టాక్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతి గృహాల్లో మరమ్మతులకు గురైన బాత్‌రూమ్‌లు, విద్యుత్‌ మరమ్మతులు పనులు చేయించాలన్నారు.

1/3

2/3

3/3

Advertisement
Advertisement