బీఎస్పీ మండల అధ్యక్షుడిగా రవివర్మ
టేకుమట్ల: బహుజన సమాజ్‌వాది పార్టీ మండల అధ్యక్షుడిగా మండలంలోని దుబ్యాల గ్రామానికి చెందిన సంగి రవివర్మను బుధవారం నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు పొన్నం భిక్షపతిగౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం రవివర్మ మాట్లాడుతూ నాపై నమ్మకంతో అధ్యక్ష పదవి అప్పగించిన జిల్లా అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తూ బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. కార్యక్రమంలో ఈసీ సభ్యులు సంగి రవి, ఆరుముళ్ల రాజు పాల్గొన్నారు.
పెండింగ్ చలాన్లపై స్పెషల్ డ్రైవ్
కాటారం : రోడ్డు రవాణా నిబంధనలు అతిక్రమించిన వాహనాలకు విధించిన జరిమానాకు సంబంధించిన పెండింగ్ చలాన్లపై పోలీసులు బుధవారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. జిల్లా ఎస్పీ కిరణ్‌ఖరే ఆదేశాల మేరకు ఎస్సై మ్యాక అభినవ్ ఆధ్వర్యంలో పోలీసులు మండల కేంద్రంలో వాహన తనిఖీలు చేపట్టారు. జరిమానా చలాన్లు చెల్లించకుండా ఉన్న పలు వాహనాల ను గుర్తించి చలాన్లు చెల్లింపులు చేయించారు. 41 వాహనాలకు సంబంధించిన రూ.21,500 ఆన్‌లైన్ ద్వారా సదరు వాహన యజమానుల ద్వారా చెల్లింపజేసినట్లు ఎస్సై తెలిపారు. వాహనదారులు చలాన్లు చెల్లించకుంటే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
కాటారం : మహాముత్తారం మండల కేంద్రాని కి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు బానోత్ జగన్‌నాయక్ ప్రధమ వర్థంతి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పాల్గొన్నారు. జగన్‌నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా కల్పించారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ నాయకులు మార్క రాముగౌడ్, లింగంపల్లి శ్రీనివాస్‌రావు ఉన్నారు.
టిప్పర్లు స్వాధీనం
టేకుమట్ల: మండలంలోని కలికోట శివారు మానేరు నుంచి ఇసుకను తరలించేందుకు సిద్ధంగా ఉన్న రెండు టిప్పర్లను మంగళవారం రాత్రి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై గోగికారి ప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి మానేరు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే సమాచారం మేరకు రెవెన్యూ, పోలీసులు సోదాలు నిర్వహించగా మానేరులో ఒడ్డున ఇసుక డంపు వద్ద ఇసుక తరలింపుకు సిద్ధంగా ఉన్న రెండు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్లు, ఓనర్లు బత్తుల రాములు, దండుగుల రవి, వంశీ, అజయ్ కుమార్‌లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
హమాలీ కార్మికుల అరెస్ట్
చిట్యాల : మండల కేంద్రంలోని సివిల్ సప్లయ్‌లో పని చేస్తున్న హమాలీ కార్మికులను స్థానిక పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లో సివిల్ సప్లయ్ కా ర్యాలయ ముట్టడి నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసినట్లు కార్మికులు తెలి పారు. రాష్ట కమిటి పిలుపు మేరకు హైదరా బాద్‌కు వెళ్తున్నారనే సమాచారం తెలుసుకుని మమ్ములను అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. హ మాలీలు సురేష్, శ్రీనివాస్, సమ్మయ్య, నర్సయ్య, ఐలయ్య, పాలల్గొన్నారు.
రేగొండలో దొంగల హల్‌చల్
రేగొండ : మండలంలోని పలు గ్రామాల్లో దొంగలు హల్‌చల్ చేస్తున్నారని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 13న మండల కేంద్రంలోని చెక్‌పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ఉన్న లారీ డీజిల్ ట్యాంక్ పగలగొట్టి 200 లీటర్ల డీజిల్‌ను దుండగులు దొంగిలించారు. అలాగే రైతు పొలాల వద్ద ఉ న్న హార్వెస్టర్‌ల నుంచి కూడా దొంగలు డీజిల్ ఎత్తుకెళ్తున్నారని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశా రు. అలాగే నాలుగు రోజుల క్రితం మండలంలోని కొత్తపల్లి బీ గ్రామసమీపంలోని భూతం బాలకృష్ణకు చెందిన వ్యవసాయ భూమిలో ఉంచిన ట్రిల్లర్‌ను ఎవరో ఎత్తుకెళ్లారు. అదే గ్రామంలోని ఓ రైతుకు చెందిన విద్యుత్ స్టార్టర్ పెట్టెను ఎత్తుకెళ్లారు. అదే గ్రామంలో పరకాల–భూపాలపల్లి జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న రెండు టిప్పర్ల నుంచి డీజిల్ చోరీ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment