సమతుల్య ఆహారం తప్పనిసరి
వాతావరణం
జిల్లాలో ఉదయం పొగమంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండగా ఉంటుంది. రాత్రి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
ఎంజీఎం : చలికాలంలో వేడివేడి పదార్థాలతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఆలుగడ్డ, బీట్‌రూట్, క్యారెట్, మష్‌రూమ్స్ వంటి దుంప కూరలు శరీరంలో వేడిని పుట్టిస్తాయి. వీటిలో ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉండడంతో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
º వేరుశనగ, బాదం, జీడి పప్పు, పిస్తా, కర్జూర వంటి తృణ ధాన్యాలు తీసుకోవాలి. ఇవి బలవర్ధకమైన ఆహారంతోపాటు శరీరంలో వేడిని పుట్టిస్తాయి.
º చలి కాలంలో యాపిల్, అరటిపండ్లు, బొప్పాయి, పైనాపిల్ వంటివి తీసుకోవాలి. వీటిలో ఫైబర్ ఉంటుంది. వేడిని ఉత్పత్తి చేస్తాయి.
º వంట గదిలోని ఆవాలు, ఎండు మిర్చి, మెంతులు, అల్లం, లవంగాలు, దాల్చిన చెక్క, పసుపు, జీరా వంటి ద్రవ్యాలు శరీరంలో వేడిని ఉత్పత్తి చేయడానికి సహకరిస్తాయి. జలుబు, దగ్గు, వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్ నుంచి ఉపశమనం పొందేందుకు ఉపయోగపడుతాయి.
º శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్స్, చక్కెర పదార్థాలు, స్వీట్లు, కేకులు, ఫ్రైడ్ రైస్, ఆల్కహాల్, బేకరీ పదార్థాలకు దూరంగా ఉండాలి.
º చలిగాలి వెళ్లకుండా తల, చెవుల భాగాలు మఫ్లర్‌తో కప్పి ఉంచాలి. స్వెటర్లు వేసుకోవాలి. ముఖ్యంగా బయటికి వెళ్లినప్పుడు మఫ్లర్‌గానీ, మంకీక్యాప్ పెట్టుకోవాలి.
వేడివేడి పదార్థాలు తీసుకోవాలి
రవీందర్‌రెడ్డి, డైటీషియన్, ఎంజీఎం
Comments
Please login to add a commentAdd a comment