పార్లమెంట్‌లో అంబేడ్కర్‌కు గుడి కట్టాలి
చిట్యాల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు పార్లమెంట్‌లో గుడికట్టాలని ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. బుధవారం మండలంలోని చల్లగరిగ బస్టాండ్ వద్ద బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, రిటెర్డ్ అడిషనల్ డీజీపీ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌లతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం చల్లగరిగ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి అంబేడ్కర్‌కు పార్లమెంట్‌తో పాటు గ్రామాల్లో గుడి కట్టాలని డిమాండ్ చేశారు. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ అంబేడ్కర్‌ను ప్రతీఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. చదువుకుంటేనే విజ్ఞానవంతులవుతార న్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మా ట్లాడుతూ దేశంలో ఓటు హక్కు ద్వారా రాజకీయ సమానత్వం కోసం కృషి చేసిన ఏకై క వ్యక్తి అంబేడ్కర్ అన్నారు. ఆయన ఆలోచన విధానం నేటి తరానికి ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో దూడపాక నరేష్, డాక్టర్ పసునూరి రవీందర్, కొల్లూరి భరత్, నలిగంటి శరత్, మిట్టపల్లి సురేందర్, మనోజ్‌కుమార్, సందీప్, రాజు నాయక్, సునీల్ నాగరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ప్రొఫెసర్ కంచె ఐలయ్య
విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు,
ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment