క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
కాటారం: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రా ణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సీఎం కప్–2024లో భాగంగా జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాటారం మండల కేంద్రంలో చింతకాని క్రాస్ వద్ద బుధవారం జి ల్లా స్థాయి క్రాస్ కంట్రీ అథ్లెటిక్ పోటీలు నిర్వహించారు. పోటీలను సబ్‌కలెక్టర్, డీఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలోని పలు మండలాలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులు, క్రీడాకా రులు పోటీల్లో పాల్గొన్నారు. అండర్ 16, 18, 20 విభాగాల్లో క్రాస్ కంట్రీ పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన 32 మంది క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూతల సమ్మయ్య తెలిపారు. కార్యక్రమంలో పంతకాని సమ్మ య్య, ఎస్సై అభినవ్, అధ్యక్షుడు చిన్నరాజయ్య, రాజ య్య, పీడీలు, పీఈటీ, తదితరులు పాల్గొన్నారు.
కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్
Comments
Please login to add a commentAdd a comment