భూపాలపల్లి అర్బన్: తెలంగాణ బయోలాజికల్ సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థా యి టాలెంట్ టెస్ట్ విజయవంతమైనట్లు ఫోరం జి ల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన టాలెంట్ టెస్ట్‌కు జిల్లాలోని వివిధ మండలాల విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరైన ట్లు తెలిపారు. తెలుగు మీడియం విభాగంలో ప్రథ మ స్థానం కాళేశ్వరం జెడ్పీ పాఠశాల విద్యార్థి కే.అలేఖ్య, ద్వితీయ స్థానం మహాదేవపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థి కే.వంశీ, ఇంగ్లిష్ మీడియం విభాగంలో ప్రథమస్థానం జంగేడు జెడ్పీ పాఠశాల విద్యార్థి కే.అజయ్, ద్వితీయస్థానంలో మోడల్ స్కూల్ విద్యార్థిని హారిక, తృతీయ స్థానంలో రామ్‌చరణ్ నిలిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జిల్లా కమ్యూనిటీ మొబైలెజింగ్ ఆఫీసర్ సామల రమేష్, మండల విద్యాధికారి దేవానాయక్, ప్రధానోపాధ్యాయుడు లక్ష్మిప్రసన్న, జిల్లా సైన్స్ అధికారి బర్ల స్వామిలు హాజరై ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందించి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment