పారదర్శకంగా సంక్షేమ పథకాల సర్వే
రేగొండ: ఈ నెల 26నుంచి అమలుచేయనున్న నాలుగు సంక్షేమ పథకాల సర్వేను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. రేగొండ మండలంలోని లింగాల, కొత్తపల్లిగోరి మండలంలోని జగ్గయ్యపేట గ్రామాలలో జరుగుతున్న ఫీల్డ్ సర్వేను ఆదివారం ఆయన పరిశీలించారు. కొత్త రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అన్నారు. జాబితాలో పేర్లు లేని లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. పేర్లులేని లబ్ధిదారులు గ్రామసభల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాధ్, తహసీల్దార్ శ్వేత, పంచాయతీ కార్యదర్శులు వేణుగోపాల్, రాము, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment