నేటితో గడువు ముగింపు
భూపాలపల్లి అర్బన్: శాసీ్త్రయ ధృక్పథాన్ని మరింతగా పెంపొందించి తద్వారా విద్యార్థులను విజ్ఞానవంతులుగా మార్చేందుకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్టీ) కృషి చేస్తోంది. ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏటా హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నారు. సబ్జెక్టును మరింతగా చేరువయ్యేలా నూతన మార్గాలను సైన్స్ ఉపాధ్యాయులు అన్వేషించాలనే ఉద్దేశంతో సెమినార్ నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు తమ మేధస్సును మరింత పదును పెట్టుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈమేరకు వారినుంచి పరిశోధన పత్రాల దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఏటా ఒక్కో అంశంపై సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ప్రధాన అంశంగా ‘మన ప్రపంచంలో సైన్స్’ని నిర్దేశించగా ఐదు ఉప అంశాలను విభజించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కళాశాలల్లోని సైన్స్ ఉపాధ్యాయులు సెమినార్‌లో పాల్గొనవచ్చు.
ఒక్క రోజే అవకాశం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 69 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 45 ప్రైవేట్ పాఠశాలలు, 25 ప్రభుత్వ, ప్రైవేట్ జూనియన్, ఐదు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వాటిలో పనిచేసే ఆసక్తి ఉన్న సైన్స్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు తమ పరిశోధన పత్రాలను వెయ్యి పదాలకు మించకుండా నాలుగు పేజీల్లో రాసి నేడు(సోమవారం) సాయంత్రం వరకు పంపాలి. ఆంగ్లం, తెలుగు భాషలో ఏదైనా ఒక దాన్ని ఎంచుకుని పీడీఎఫ్ రూపంలో మెయిల్ ఐడీకి పంపాలి. వాటిని పరిశీలించి ఎంపికై న వారికి ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సదస్సులో పాల్గొనే అవకాశం కల్పిస్తారు.
సైన్స్ ఉపాధ్యాయులకు సెమినార్
పరిశోధన పత్రాలకు
దరఖాస్తుల స్వీకరణ
‘మన ప్రపంచంలో సైన్స్’ అనే అంశం
ఐదు ఉప అంశాలుగా విభజన
అంశాలు..
ఏటా నిర్వహిస్తున్న సైన్స్ సెమినార్‌లో శాస్త్ర సాంకేతికతను ఉన్నతీకరిస్తూ ప్రధాన అంశాన్ని రూపొందిస్తున్నారు. ఇందుకనుగుణంగా ఈ ఏడాది ‘మన ప్రపంచంలో సైన్స్’ అనే ప్రధానాంశంపై సెమినార్ ఉంటుంది. దీనికి ఐదు ఉప అంశాలు ఉంటాయి.
సైన్స్ బోధనలో కృత్రిమ మేథ చర్య, ప్రభావం
పాఠశాలల్లో సుస్థిర పర్యావరణ వ్యవస్థ నిర్వహణ కోసం వ్యూహాలు
విద్యార్థుల శ్రేయస్సుకు ఆహార విద్య, ఉపాధ్యాయుల పాత్ర
సైన్స్‌లో విద్యాప్రమాణాలు మెరుగుపర్చేందుకు శాసీ్త్రయ మార్గాలు
రసాయన శాస్త్రం నేర్చుకునేందుకు సాధనాలు, కొత్త బోధన పద్ధతులు అనే అంశాలు ఉన్నాయి. వీటి ఆధారంగా ఉపాధ్యాయులు తమ అనుభవాలను పరిశోధన పత్రాల రూపంలో పంపాల్సి ఉంటుంది. నిర్దేశిత అంశాల్లో ఏదో ఒకటి ఎంచుకుని లింకు ద్వారా పత్రాలను సమర్పించాలి. ప్రతిభ ఆధారంగా ఎస్‌సీఈఆర్టీ అధికారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment