టీబీజీకేఎస్ అఽధికార ప్రతినిధిగా గోవర్ధన్
భూపాలపల్లి అర్బన్: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) బ్రాంచ్ కమిటీ అధికారి ప్రతినిధిగా సుంకరి గోవర్ధన్‌ను నియమించినట్లు బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం బ్రాంచ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్రాంచ్ కార్యదర్శులుగా బాషనపల్లి కుమార్, రాంచందర్, వెంకట్రాజం, నరేందర్, మైనింగ్ స్టాఫ్ ఇన్‌చార్జ్‌గా చీకటి వంశీలను నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సదానందం, మధు, నరేష్, రాజేందర్, వంశీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment