అర్హులందరికీ రేషన్ కార్డులు
మొగుళ్లపల్లి: అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌కార్డులు జారీ చేస్తామని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. రైతు భరోసా, రేషన్ కార్డులు జారీకోసం ఆదివారం మొగుళ్లపల్లి మండలకేంద్రంలో జరుగుతున్న క్షేత్రస్థాయి విచారణ ప్రక్రియను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. ప్రజలు ఆందోళన చెందొద్దని తెలిపారు. ప్రస్తుతం రేషన్‌కార్డ్‌ల లబ్ధిదారుల జాబితా సామాజిక, ఆర్ధిక, కుల, రాజకీయ సర్వే ఆధారంగా తయారు చేసిందని, ఇది తుది జాబితా కాదని స్పష్టం చేశారు. గతంలో స్వీకరించిన ప్రజాపాలన దరఖాస్తుల జాబితాలో అర్హులైన వారిని గుర్తించే ప్రక్రియ పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సునిత, ఎంపీడీఓ హుస్సేన్, వ్యవసాయాధికారి సురేందర్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి సునిత తదితరులు పాల్గొన్నారు.
సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
చిట్యాల: రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల సర్వేను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మండలంలోని తిర్మలాపూర్, లక్ష్మీపూర్‌తండాలో జరుగుతున్న సర్వేను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హేమ, ఎంపీడీఓ జయశ్రీ, ఆర్‌ఐ రాజు, ఏఈఓ రమణకుమార్, పంచాయతీ కార్యదర్శులు, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.
నేటి ప్రజావాణి రద్దు
భూపాలపల్లి రూరల్: నేడు (సోమవారం) కలెక్టరేట్‌లో జరుగనున్న ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో రైతు భరోసా, నూతన రేషన్ కార్డుల విచారణ ప్రక్రియలో జిల్లా, మండల స్థాయి అధికారులు భాగస్వాములైనందున ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలిపారు.
కలెక్టర్ రాహుల్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment