సమన్వయంతో పనిచేయాలి.. | Sakshi
Sakshi News home page

సమన్వయంతో పనిచేయాలి..

Published Fri, Apr 19 2024 1:45 AM

-

గద్వాల రూరల్‌: వేసవిలో జిల్లాలో ఎక్కడా కూడా తాగునీటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. మిషన్‌భగీరథ అధికారులు, జిల్లా పరిషత్‌, పంచాయతీ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గట్టు, అయిజ, మానోపాడు, ఇటిక్యాల మండలాల్లోని గ్రామపంచాయతీల వారీగా గత సమీక్షలో చర్చించి చేపట్టిన అవసరమైన పనులకు సంబంధించి వివరాలు అడిగితెలుసుకున్నారు. గ్రామాలలో ప్రజల అవసరాలకు ఎన్ని లీటర్ల నీరు అవసరం ఎంత సరఫరా చేస్తన్నాం అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే సహించేదిలేదన్నారు. అదేవిధంగా అవసరమైన ప్రతిచోట చేతిపంపులు, బోరుమోటర్లు, పైపులైన్‌ల మర్మమత్తులు చేపట్టి సక్రమంగా తాగునీటి సరఫరా చేయాలన్నారు. వచ్చే రెండునెలల పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఈసమావేశంలో మిషన్‌భగీరథ ఎస్‌ఈ జగన్‌మోహన్‌రెడ్డి, ఈఈలు శ్రీధర్‌రెడ్డి, భీమేశ్వర్‌రావు, డీఆర్‌డీవో నర్సింగ్‌రావు, ఇంచార్జీ డీపీవో వెంకట్‌రెడ్డి, ఆయా మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement