ఆదిశిలా క్షేత్రం.. భక్తజనసంద్రం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రంలో మంగళవారం భక్తుల రద్దీ కొనసాగింది. స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. వేదపండితులు స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం పుష్కరిణిలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు చక్రస్నానంతో ఉత్సవాలకు ముగింపు పలికారు. అక్కడి నుంచి భాజా భజంత్రీలతో కల్యాణ మండపం వరకు స్వామివారికి పల్లకీ సేవ నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. ధీరేంద్రాదాసు ఆధ్వర్యంలో బ్రాహ్మ ణ పండితులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ నందీకర్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, అర్చకులు రమేషాచారి, భీంసేనాచారి, మధుసూదనాచారి, రవిచారి, ప్రసన్నాచారి, శశాంక్, శేషదాసుల వారి వంశస్థులు ప్రకాష్‌రావు, రా ఘవేంద్రదాసు, విష్ణుదాసు, అరవిందరావు, నాగ రాజు శర్మ, చంద్రశేఖర్‌రావు, ముకుందరావు, బాబురావు, మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment