కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
గద్వాలటౌన్: జిల్లాలోని విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగులను తక్షణం క్రమబద్ధీకరించాలని, తమ ఉద్యోగ జీవితాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎస్‌ఏ కాంట్రాక్టు ఉద్యోగులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. బుధవారం దీక్ష శిబిరం నుంచి నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని ప్రధాన రహదారుల వెంటా ఫ్లకార్డులు చేతపట్టి ర్యాలీ నిర్వహించారు. డిమాండ్లను నెరవేర్చాలని నినదించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలోని విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం కేజీబీవీ సీఆర్‌టీలు, సీఆర్పీలు, డీఎల్‌ఎంటీ, సీసీఓ, పీటీఐ, యూఆర్‌ఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్లకార్డులు చేతబట్టి దీక్ష చేపట్టారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు విజయ్‌కుమార్‌తో పాటు పులు సంఘాల నాయకులు దీక్ష శిబిరానికి సంపూర్ణ మద్దతును ప్రకటించి ఉద్యోగులనుద్ధేశించి మాట్లాడారు. గతేడాది ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులకు ఇచ్చిన హామీని సీంఎ రేవంత్‌రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టత ఇవ్వాలన్నారు. ఉద్యోగులను రెగ్యులర్ చేయకుంటే ప్రభుత్వంపై సమరం సాగిస్తామని హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి ఉద్యోగికి జీవిత బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఉద్యోగులను రెగ్యులర్ చేసే వరకు కనీస వేతన స్కేల్‌ను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు హుస్సేనప్ప, గోపాల్, రామంజనేయులు, శ్రీధర్, ఆల్తాఫ్, సమీ, మురళి, రాజేందర్‌తో పాటు కేజీబీవీ ఎస్‌ఓలు, సీఆర్‌టీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment