విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి
శాంతినగర్/మానవపాడు: ఉద్యోగులు సమ్మె చేస్తున్న కారణంగా కేజీబీవీల్లో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని డీఈఓ అబ్దుల్ ఘని.. డ్యూటీ టీచర్‌లు, వర్కర్లకు సూచించారు. బుధవారం ఆయన వడ్డేపల్లి కేజీబీవీ, మానవపాడు మండలం చంద్రశేఖర్‌గనర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు సమ్మె చేస్తున్న కారణంగా కేజీబీవీల్లో పరిస్థితి ఎలా వుందనే విషయమై పాఠశాలను, తరగతి గదులు, భోజనం తదితర సమస్యలు ఏవైనా తలెత్తుతున్నాయనే విషయమై డీఈఓ పరిశీలించారు. ఈసందర్భంగా విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ త్వరలోనే ఉపాధ్యాయులు పాఠశాలకు వస్తారని, విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆయన హామీ ఇచ్చారు. వారు విధుల్లో చేరేవరకు జాగ్రత్తగా వుండాలని సూచించారు. అలాగే, విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించాలని, ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు అన్ని అంశాలపై కనీస పరిజ్ఞాన్ని అందించాలన్నారు. మధ్యాహ్న భోజన మెనూను తప్పక పాటించాలని ఆదేశించారు. ఆయన వెంట వడ్డేపల్లి ఎంఈఓ నరసింహ, ఉండవెల్లి ఎంఈఓ శివప్రసాద్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment