‘పీజేపీ’ సమీపంలోనే కోర్టు సముదాయాలు
గద్వాల క్రైం: జిల్లా కోర్టు సమూదాయాలు తరలించే విషయంపై గద్వాల బార్ అసోసియేషన్ సభ్యులు బుధవారం కోర్టు బయట నిరసన దీక్షలను ప్రారంభించారు. ఈ దీక్షకు బీఆర్‌ఎస్ పార్టీ, ఇండియన్ మెడికల్ అసోషియేషన్ వైద్యులు సైతం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్, మోహన్‌రావు, కిషోర్‌కుమార్, అతికూర్ రహిమాన్, నాగర్‌దొడ్డి వెంకట్రాములు మాట్లాడారు. అన్ని వసతులు కలిగిన జిల్లా కేంద్రంలోని పీజెపీ క్యాంపు ప్రభుత్వ స్థలంలో నూతన కోర్టు సమూదాయాల కోసం స్థలం కేటాయించాలన్నారు. అందరికి యోగకరమైన వాతావరణంలో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న క్రమంలో కోర్టు సమూదాయాలను మాత్రం 10 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేయడం వెనుక మోసపూరితమన్నారు. కక్షిదారులు, వివిధ కేసులోని బాధితులకు అనువుగా పాత సమూదాయాలు అప్పట్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎంతో అభినందనీయమన్నారు. తాజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏ మాత్రం యోగ్యత లేదన్నారు. న్యాయవాదులు చేపట్టిన నిరసన ఆమోదకరంగా ఉందని, ఇప్పటికై న ప్రభుత్వ ఽఅధికారులు పూడుర్ శివారులోని హ్యండ్లూం పార్కు సమీపంలో ఇచ్చిన స్థల విషయంలో పునరాలోచన చేయాలన్నారు. న్యాయవాదుల నిరసనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో బార్ అసోషియేషన్ సభ్యులు రాఘురామిరెడ్డి, ఖజ్జమైన్దుదిన్, రాజశేఖర్‌రెడ్డి, వైద్యులు నళ్లీని, ఆశ్వీని, అనుపమ, భాస్కర్‌రెడ్డి, నవిన్‌క్రాంతి, ఆశోక్ తదితరులు ఉన్నారు.
వేరుశనగ క్వింటా రూ.6,659
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్‌యార్డుకు బుధవారం 432 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.6659, కనిష్టం రూ.3750, సరాసరి రూ.4840 ధరలు పలికాయి. అలాగే, 2 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం, కనిష్టం, సరాసరి రూ. 5429 ధర లభించింది. దీంతోపాటు 787 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.2609, కనిష్టం రూ.1759, సరాసరి రూ.2472 ధరలు పలికాయి. 18 క్వింటాళ్ల వరి (హంస) రాగా గరిష్టం, కనిష్టం, సరాసరి రూ. 1856 ధర వచ్చింది.
ఎకో టూరిజం పార్కు మరింత అభివృద్ధి
కొల్లాపూర్ రూరల్/పెద్దకొత్తపల్లి: కొల్లాపూర్ మండలం సోమశిల సమీపంలోని అటవీ ప్రాంతంలో నిర్మిస్తున్న ఎకో టూరిజం పార్కును మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ సువర్ణ అన్నారు. బుధవారం అటవీశాఖ అధికారులతో కలిసి ఎకో టూరిజం పార్కును పరిశీలించారు. ఈ సందర్భంగా పార్కులో చేపట్టిన పనుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. సోమశిల కృష్ణానది తీరంలో ఎకో టూరిజం కింద అనేక అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉందన్నారు. అందుకు అవసరమైన ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. అదే విధంగా నేషనల్ హైవే ప్రాజెక్టుతో పాటు సోమశిల – సిద్దేశ్వరం మధ్య కృష్ణానదిపై కేబుల్ బ్రిడ్జి ప్రతిపాదనలు అటవీశాఖకు అందినట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అనుసంధానంగా అటవీ ప్రాంతం పరిధి ఉందని.. ఆయా ప్రతిపాదనలపై అవసరమైన చర్యలు చేపడతామన్నారు. సోమశిలలో ఎకో టూరిజం ప్రాజెక్టులో భాగంగా సఫారి రివర్ బోటు ఏర్పాటు చేశామన్నారు. నల్లమలలో పర్యాటకులు చూడాల్సిన ప్రాంతాలు అనేకం ఉన్నాయని.. ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. అనంతరం ఎకో పార్కులో కల్పించాల్సిన వసతులపై ఆరా తీశారు. ప్రధాన రహదారి నుంచి పార్కు పైభాగం వరకు సీసీరోడ్డు నిర్మిస్తామని తెలిపారు. త్వరలోనే పర్యాటకులకు పార్కును అందుబాటులోకి తెస్తామన్నారు. అనంతరం సోమశిలలో అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment