సమగ్రశిక్ష ఉద్యోగుల మౌన ప్రదర్శన
గద్వాలటౌన్: జిల్లాలోని విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్రశిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తమ ఉద్యోగ జీవితాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సమగ్రశిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలకు మంగళవారం వివిధ సంఘాల నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీక్ష శిబిరంలో ఉద్యోగులు మౌన ప్రదన్శనతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా పనిచేస్తూ గురుకులాలతో సమానంగా ఫలితాలు సాధిస్తున్నా.. శ్రమకు తగిన వేతనం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్రశిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకుంటే ప్రభుత్వంపై సమరం సాగిస్తామన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి ఉద్యోగికి జీవిత బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment