మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు వేగవంతం
గద్వాల: మున్సిపాలిటీలకు ఆదాయాలను పక్కాగా నిర్వహించి అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాలులో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని గద్వాల, అయిజ, వడ్డేపల్లి, అలంపూరు, మున్సిపాలిటీలకు 15వ ఫైనాన్స్ నిధులు, సీఎం అష్యూరెన్స్‌ఫండ్స్, స్థానికంగా పన్నులు, నిర్మాణాల అనుమతులు, ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా వచ్చే నిధులపై కమీషనర్లను అడిగి తెలుసుకున్నారు. వచ్చిన ఆదాయం, మంజూరైన నిధులను వినియోగించుకుని మున్సిపాలిటీలలో అభివృద్ధి పనులు, శానిటేషన్, తాగునీరు సరఫరా, విద్యుత్ నిర్వహణ వంటివి పక్కాగా చేపట్టాలన్నారు. అదేవిధంగా నిధుల మళ్లింపు ప్రక్రియ చేయకుండా పక్కాగా వినియోగించుకోవాలన్నారు. స్వచ్ఛభారత్ నిధుల కింద చేపట్టిన మరుగుదొడ్లు, పబ్లిక్‌టాయిలెట్స్, కమ్యూనిటీ హాల్స్ వంటి పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, మున్సిపల్ కమీషనర్లు, డీఈలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment