రోగాలులు వస్తున్నాయి
●
కాచి చల్లార్చిన నీరు తాగాలి
కాచి చల్లార్చిన నీరు, వేడి ఆహారాన్ని తీసుకోవడం మంచిది. చలికాలంలో చేతుల పరిశుభ్రత చాలా ముఖ్యం, చేతులు శుభ్రంగా కడుక్కున్నాకే ఆహారం తీసుకోవాలి. ఇంటి పరిసరాలు, ఆవరణలో దోమల నివారణ చర్యలు చేపట్టాలి. శీతల పానియాలు, ఐస్‌క్రీంలకు దూరంగా ఉండాలి. చిన్నారులకు స్వెట్టర్లు వేయకుండా ఇంట్లో, బయట తిరగనివ్వొద్దు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చలి వేళ వీలైనంత మేర బయట తిరగొద్దు. రాత్రి సమయల్లో ఎక్కువగా బయట తిరిగితే గుండెపోటు, చాతినొప్పి వచ్చే ప్రమాదం ఉంది. వ్యాయామాలు వీలైనంత వరకు చలి తగ్గి, సూర్యుడు వచ్చాకే చేయాలి. స్వెట్టర్ ధరించడమే కాకుండా తల, కాళ్లు, చేతుల రక్షణకు జాగ్రత్త వహించాలి. విటమిన్ – సీతో కూడిన పండ్లు, ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. జలుబు, దగ్గు, జ్వరం సోకితే సొంత వైద్యం కాకుండా వైద్యులను సంప్రదించాలి. వారి సూచనలతో ముందులు వాడాలి.
– సిద్ధప్ప, జిల్లా ఇంచార్జ్ వైద్యాధికారి
గద్వాల క్రైం: చలి తీవ్రత పెరగడం.. ప్రధానంగా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోవడంతో ప్రజలు రోగాల భారినపడుతున్నారు. ఉదయం 9 గంటల వరకు చలి తగ్గకపోగా.. సాయంత్రం 5గంటల నుంచే చల్లిని గాలులు మొదలవుతుండడం.. వాతావరణంలో అనూహ్య మార్పులకు తోడు చలి తీవ్రత కారణంగా చాలా మందికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. గత మూడు నాలుగు రోజులుగా ఆస్పత్రుల్లో ఓపీ కేసులను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఆసుపత్రులకు వస్తున్న కేసుల్లో జ్వరంతో పాటు జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుండగా న్యుమోనియా బారిన పడ్డ చిన్నారులు, వృద్ధులే అధికం. గద్వాల, గట్టు, మల్దకల్, ఇటిక్యాల, అలంపూర్, ధరూర్ తదితర ప్రాంతాల్లోని ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతుండగా.. చలి ప్రభావం చిన్నపిల్లలు, వృద్ధులపై అధికంగా ఉంటోందని, జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. మున్ముందు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ముప్పు తప్పదని వైద్యులు వివరిస్తున్నారు.
ఆస్పత్రులకు క్యూ..
వాతావరణంలో వచ్చిన మార్పుల దృష్ట్యా వారం రోజులుగా జిల్లాలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతుంది. ఇప్పుడే ఇలా ఉంటే ముందు రోజుల పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో బయటికి రావాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది. చలికోట్లు, స్వెటర్లు, తలకు తువాలు చుట్టుకొని బయటకు రావాల్సి వస్తోంది. ఇదిలాఉండగా, చలి తీవ్రతతో ఆరోగ్య సమస్యలతో ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. జిల్లా ఆస్పత్రిలో వారం రోజుల్లో ఓపీ సేవలు రోజుకు 450 నమోదు అవుతున్నాయి. ఇందులో 340 జ్వరం, దగ్గు, జలుబు, న్యుమోనియా బారిన పడిన వారే. మిగతా వారు వివిధ అనారోగ్య సమస్యలతో వస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి బట్టి కొందరు మందులు తీసుకొని ఇళ్లకు వెళ్తుండగా.. మరికొందరు ఇన్‌పేషంట్‌గా చేరి చికిత్స పొందుతున్నారు. చలి తీవ్రత దృష్ట్యా చిన్నారుల్లో ఆస్తమా, న్యుమోనియా సమస్యలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లోను రోగుల సంఖ్య పెరిగింది.
జిల్లా ఆస్పత్రిలో ఓపీ సేవల వివరాలిలా..
తేదీ ఓపీ ఐపీ
13 467 77
14 491 38
15 440 62
16 438 45
17 470 28
18 467 39
జ్వరం, జలుబు, న్యుమోనియా బాధితులే అధికం
ఆస్పత్రుల్లో పెరుగుతున్న కేసులు
రాత్రి వేళల్లో అంతకంతకూ
పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు
అప్రమత్తంగా ఉండాలంటున్న
వైద్యారోగ్య శాఖ అధికారులు
అప్రమత్తంగా ఉండాలి
చలికాలంలో వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సాధారణ సమయాన జలుబు, దగ్గు, జ్వరంతో ప్రమాదం లేకున్నా.. చలికాలంలో ఈ సమస్యలు వస్తే వైద్యులను సంప్రదించాలి. చల్లటి వాతావరణంలో బయటికి వెళ్లాల్సి వస్తే.. మాస్క్ ధరించాలి. పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వృద్ధులకు రక్త ప్రసరణ మందగించి గుండె జబ్బులు పెరిగే అవకాశముంది. వీరికి పౌష్టికాహారం అందిస్తూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకునేలా చూడాలి. నిత్యం వ్యాయామం చేయడం ఎంతో మేలు.
–డాక్టర్ వంశీ,
జనరల్ ఫిజీషిషన్, జిల్లా ఆస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment