విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి
మల్దకల్: మార్చిలో జరగనున్న ఇంటర్ వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదువుకొని వంద శాతం ఉత్తీర్ణతను సాధించాలని ఇంటర్మీడియెట్ జిల్లా అధికారి హృదయరాజు సూచించారు. గురువారం మల్దకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా విద్యార్థులు, అధ్యాపకుల హాజరు రిజిష్టర్‌లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుని మంచి ఉత్తీర్ణతను సాధించాలన్నారు. విద్యార్థులకు ఇంటర్ విద్య ఎంతో కీలకమని, తమ బంగారు భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అదే విధంగా విద్యార్థులకు మత్తు , డ్రగ్స్ వినియోగం వలన కలిగే అనర్థాలను వివరించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ నర్సింహులు, అధ్యాపకులు రామాంజనేయులు గౌడ్, భాగ్యలక్ష్మీ, గోవర్దన్‌శెట్టి, దేవసేనారెడ్డి, తిమ్మోతి, శ్రీనాథ్, రవి ప్రకాష్ శెట్టి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment