స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకండి
గద్వాలటౌన్: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్థానిక సంస్థలలో అత్యధిక స్థానాలను గెలిచి రాష్ట్రంలో బలమైన పార్టీగా నిలబడాలన్నారు. అన్ని వర్గాల ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని చెప్పారు. అమలుకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు పాలించే నైతిక హక్కు లేదని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం రైతు కూలీలకు ఇస్తానన్న రూ.12 వేల జీవనభృతి ఏమైందని ప్రశ్నించారు. రూ.2లక్షల రుణమాఫీ అరకొరగా చేసి.. వందశాతం పూర్తిచేసినట్లు సీఎం రేవంత్‌రెడ్డి అబద్దాలు చెప్పారని, వరికి ఇచ్చే బోనస్‌పై బోగస్ మాటలు చెబుతున్నారని ఆరోపించారు. ఆసరా పింఛన్లు రూ.4 వేలకు పెంచుతామని చెప్పి మోసగించారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అప్సర్‌పాష, రామచంద్రారెడ్డి, డీకే స్నిగ్దారెడ్డి, రామంజనేయులు, రవికుమార్, శివారెడ్డి, రాజగోపాల్, కౌన్సిలర్ జయశ్రీ, నర్సింహా, రాజశేఖర్‌శర్మ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment