రుణ లక్ష్యం రూ.1,265 కోట్లు
రంగుల విక్రయ కేంద్రం మహిళల సందడి
బ్యాంకుల వారీగా రుణలక్ష్యం ఇలా.. (రూ.కోట్లలో)
బ్యాంక్ రైతులు రుణ లక్ష్యం
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 121 2.24
కెనరా బ్యాంక్ 3,463 71.38
సెంట్రల్ బ్యాంక్ 1,268 28.67
ఇండియన్ బ్యాంక్ 3590 78.40
ఎస్‌బీఐ 21,810 471.63
యూబీఐ 9,952 220.59
యాక్సిస్ బ్యాంక్ 7,58 14.64
హెచ్‌డీఎఫ్‌సీ 1,049 22.52
ఐసీఐసీఐ 1,579 31.44
ఇండస్‌ఇండ్ 157 3.07
కేబీఎస్ 1,643 33.40
కొటాక్ మహేంద్ర 303 5.47
ఎండీసీసీబీ 4,096 91.90
టీజీవీబీ 8,397 189.65
గద్వాలన్యూటౌన్: జిల్లాలో 2024–25 ఆర్థిక సంవత్సరం యాసంగి సీజన్ పంట రుణ లక్ష్యం ఖరారైంది. యాసంగి పంటలు పండించే 58,186 మంది రైతులకు రూ. 1,265 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. పంట పెట్టుబడుల కోసం ఇక్కడి రైతులు బ్యాంకులు అందించే రుణాలపైనే అధారపడ్డారు. బ్యాంకర్లు సకాలంలో రుణాలు అందిస్తేనే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
నడిగడ్డ వ్యవసాయ ఆధారిత జిల్లా. ఇక్కడ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్టులతో పాటు నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద ఏడు రిజర్వాయర్లు, వందకు పైగా చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటికి తోడు కొందరు రైతులు బోరుబావులను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఏటా రెండు సీజన్‌లలో దాదాపు 5 లక్షల ఎకరాల వరకు వివిధ రకాల పంటలు సాగు చేస్తుంటారు. పండ్ల తోటలు, కూరగాయలు సైతం పండిస్తున్నారు. అయితే జిల్లాలో సన్న, చిన్నకారు రైతులు వేల సంఖ్యలో ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలతో రైతులకు పూర్తి పంట పెట్టుబడుల అవసరాలు తీరడం లేదు. దీంతో బ్యాంకులు అందించే పంట రుణాలనే పంట పెట్టుబడులుగా ఉపయోగిస్తూ సేద్యం చేస్తున్నారు.
వానాకాలంలో 60 శాతం రుణాలు..
2024–25 ఆర్థిక సంవత్సరం వానాకాలం సీజన్‌లో 87,279 మంది రైతులకు రూ. 1,897 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో దాదాపు 60 శాతం రుణాలను బ్యాంకర్లు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం జూలై, ఆగస్టు నెలల్లో మూడు విడతలుగా రూ. 2లక్షల వరకు రుణమాఫీ చేసింది. దీంతో చాలా మంది రైతులు తమ రుణాలను రెన్యువల్ చేసుకున్నారు. ఫలితంగా 60 శాతం వరకు రుణాలు అందించామని బ్యాంకర్లు అంటున్నారు.
లక్ష్యం నెరవేరితేనే ప్రయోజనం..
వ్యవసాయమే ప్రధాన జీవనాధారం ఉన్న రైతుల్లో 90 శాతం మంది సన్న, చిన్నకారు రైతులే ఉన్నారు. అయితే యాసంగి సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది.
చాలా చోట్ల వేరుశనగ, పప్పుశనగ, మొక్కజొన్న పంటలు వేశారు. వరి సాగులో భాగంగా నాట్లు వేస్తున్నారు. ఈ సమయంలో పంట పెట్టుబడులకు డబ్బు అవసరం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు బ్యాంకు రుణాలపైనే ఆధారపడుతున్నారు. బ్యాంకర్లు సకాలంలో రుణాలు అందిస్తేనే రైతులకు ప్రయోజనం చేకూరనుంది. బ్యాంకులు రుణాలు అందించకపోతే రైతులు ప్రైవేటులో అప్పులు చేయాల్సి వస్తోంది. అధిక వడ్డీలు చెల్లించి ఆర్థికంగా నష్టపోతారు. పంటలు ఆశించిన స్థాయిలో పండకపోతే ప్రైవేటుగా తీసుకున్న అప్పులకు రైతులు వడ్డీ మాత్రమే చెల్లిస్తారు. అసలు అలాగే ఉండి నెలలు తరబడి వడ్డీలు చెల్లిస్తూ.. ఆర్థికంగా బలహీన పడిపోయే పరిస్థితులు ఉంటాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని బ్యాంకులు సకాలంలో రుణాలు అందించి.. రైతులకు తోడ్పాటు అందిస్తేనే ప్రయోజనం ఉంటుంది.
యాసంగిలో 58,186 మంది రైతులకు పంట రుణాలు ఇవ్వాలని నిర్దేశం
బ్యాంకర్లు సకాలంలో అందిస్తేనే ప్రయోజనం
అర్హులైన రైతులందరికీ రుణాలు..
పంట రుణాల కోసం దరఖాస్తు చేసుకునే అర్హులైన రైతులందరికీ రుణాలు అందిస్తాం. రుణమాఫీ చేయడం వల్ల చాలా మంది రైతులు తమ రుణాలను రెన్యువల్ చేసుకుంటున్నారు. దీనివల్ల రుణాలు అందించడానికి వీలు అవుతుంది. యాసంగి సీజన్‌లో లక్ష్యం మేరకు రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – అయ్యపురెడ్డి, ఎల్‌డీఎం
Comments
Please login to add a commentAdd a comment