సంబరాల సంక్రాంతి
మొదలైన మూడు రోజుల పండగ సందడి
వయ్యారి గాలిపటాలు..
సంక్రాంతి అంటే గుర్తుకు వచ్చేది గాలిపటాలే. జనవరి మొదటి వారంలోనే వీటి సందడి మొదలైంది. రివ్వున ఆకాశంలోకి ఎగిరి.. కట్టిన దారాలతో గగన విహారం చేస్తూ.. హరివిల్లు రంగులను పులుముకున్న కాగితం పక్షులు గాలిపటాలు. పిల్లల హృదయాలతో పాటు పెద్దలను సైతం రంజింపచేస్తాయి. అందరినీ ఆకర్షించేలా కొత్త కొత్త ఆకృతులు, బొమ్మలతో గాలిపటాలు వచ్చాయి. జాతీయ నాయకులు, సినీ హీరోలు, రాజకీయ నాయకులు, డోరెమన్, బెన్ 10, క్రికెట్ ఆటగాళ్లు తదితర గాలిపటాలు ప్రత్యేక ఆకరక్షణగా మార్కెట్‌లో నిలుస్తున్నాయి. రెండు రోజులుగా చిన్నారులు గాలిపటాలు ఎగురవేస్తూ ఉత్సాహంగా గడుపుతున్నారు.
● నేడు భోగభాగ్యాల భోగి
● రేపు సంక్రాంతి,
ఎల్లుండి కనుమ కోలాహలం
● సంస్కృతిని ప్రతిభింబించే తెలుగు పండగ
ఇదీ విశిష్టత..
ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు భోగి పండగ రోజు ఇంద్రుడికి ప్రత్యేక పూజలు చేస్తాడు. మీరు కూడా చేయాలని యాదవులకు ఆజ్ఞాపించారని పురాణాలు చెబుతున్నాయి. ఇదే రోజు శ్రీరంగనాథుడిని గోదాదేవి వివాహం చేసుకుంది. దీంతో ఏటా
వైష్ణవాలయాల్లో భోగి పర్వదినం రోజు గోదాదేవి కల్యాణం నిర్వహిస్తారు. ఈ రోజు వ్యవసాయ పనిముట్లతో పాటు కొత్తగా కొనుగోలు చేసిన
వాహనాలకు పూజలు చేస్తారు. పలు ప్రాంతాల్లో బలి చక్రవర్తిని పూజిస్తారు. ఉదయాన్నే భోగి మంటలు వేసి, ఇంట్లోని పాత వస్తువులను కాల్చేస్తారు. ఇంటి ఎదుట మంట వేయడం వల్ల ఇంట్లోని దారిద్య్ర దేవతను తరిమినట్లుగా హిందువులు విశ్వసిస్తారు. ఆడవాళ్లు ఇంటి ముంగిళ్లలో రంగురంగుల ముగ్గులు వేస్తారు. వాటిపై ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టి.. పసుపు, కుంకుమ, గరిక పోచలతో అలంకరిస్తారు. రేగుపండ్లు, నవధాన్యాలు పోసి తమ ఇల్లు పాడిపంటలు, సిరి సంపదలతో తులతూ
గాలని మనసారా
మొక్కు
కుంటారు.
Comments
Please login to add a commentAdd a comment