‘‘అయ్యవారికి దండంపెట్టు.. అమ్మవారికి దండం పెట్టు.. ఈ ఇంటికి మంచి జరుగుతదని చెప్పు..’’అంటూ గంగిరెద్దులను ఆడించే వారు అనగానే తల ఊపి అవునన్నట్లుగా సమాధానం ఇస్తుంది. సంక్రాంతి వేడుకల్లో డూడూ బసవన్నల ఆటలు కూడా ప్రధానమైనవి. ఆడించేవారు చెప్పినట్లుగా తల ఊపుతూ.. కాళ్లు కదుపుతుంటే గజ్జెల శబ్ధంతో ఇళ్లు మందు గంగిరెద్దులు చేసే విన్యాసాలు ఆకట్టుకుంటాయి. ఇంటి ముందుకు గంగిరెద్దు రాగానే ఇంట్లో ఉన్న కొత్త ధాన్యం గింజలను గంగిరెద్దులకు ఇరువైపుల ఉన్న జోళ్లేలో పోసి ఆశీర్వాదం తీసుకుంటారు. 300–400 కేజీలు బరువున్న గంగిరెద్దు ఒక వ్యక్తిపై తన నాలుగు కాళ్లు పెట్టి ఊపిిరిబిగబట్టడం చూస్తే గంగిరెద్దుకు, ఆ యజమానికి ఉన్న నమ్మకం బసవన్నకు ఉన్న
ప్రత్యేకత.
Comments
Please login to add a commentAdd a comment