గట్టు: గట్టు తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న సరితారాణిపై కలెక్టర్ బీఎం సంతోష్ సస్పెన్షన్ వేటు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకు సంబందించి సాగుకు యోగ్యం కాని భూముల వివరాలను గుర్తించేందుకు రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులకు పనులు అప్పగించింది. అయితే, రెండు రోజుల క్రితం అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ గట్టు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నప్పటికీ తహసీల్దార్ అందుబాటులో లేక పోవడంతో పాటుగా ఇతర కారణాల కారణంగా తహసీల్దార్‌పై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని కార్యాలయానికి ఈమెయిల్ చేసినట్లు సమాచారం. సస్పెన్షన్ విషయాన్ని సైతం అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment