ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష
గద్వాలటౌన్ : వట్టెం జవహర్ నవోదయ పాఠశాలలో ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 27 పరీక్ష కేంద్రాలలో మొత్తం 6,602 మంది విద్యార్థులకు గాను 5,331 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మొత్తం 1,271 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక జిల్లా విషయానికి వస్తే 967 మంది విద్యార్థులకు గాను 800 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష కొనసాగింది. డీఈఓ కార్యాలయ అధికారులతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, ఆయా మండలాల ఎంఈఓలు ప్రవేశ పరీక్ష కేంద్రాలను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment