సాగుకు యోగ్యం కాని భూములు గుర్తించాలి
గద్వాల: వ్యవసాయానికి యోగ్యంగా లేని భూములు గుర్తించి వారిని రైతు భరోసా పథకానికి అనర్హులుగా గుర్తించాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. శనివారం ఐడిఓసీ కాన్సరెన్స్ హాల్‌లో రైతు భరోసా పథకం అమలుపై సంబందిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, మండలాల వారిగా వ్యవసాయ భూములు, సాగు చేయలేని భూములు విస్తీర్ణం వాటి గుర్తింపు విధానాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతు భరోసా పథకానికి సంబందించి 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామ సభలు పక్కాగా జరిగే విధంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. సాగు జరగని భూములను క్షేత్రస్ధాయిలో గుర్తించి ఆ భూములను రైతు భరోసా పథకానికి అనర్హులుగా ప్రకటించాలని అధికారులను సూచించారు. చెరువులు, పౌల్ట్రీ ఫారమ్‌లు ఉన్న భూములను గుర్తించి వాటిని తోలగించాలని గ్రామ పటాలు, కాడ్రాస్ట్రియల్ పటాల ఆదారంగా భూములను సమర్థవంతంగా గుర్తించాలన్నారు. ఈ సర్వేలో నలా కన్వర్షన్ భూములకు ఫైల్ నంబర్ ఉండాలని, ఎల్‌ఆర్‌ఎస్ ధరఖాస్తులు లేదా లేఔట్లు ఉన్న భూములను వ్యవసాయేతర భూములుగా పరిగణించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ. ఆర్డీఓ శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియనాయక్, తహసీల్ధార్‌లు తదితరులు ఉన్నారు.
సకాలంలో సర్వే పూర్తి చేయాలి
అయిజ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా, రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపిక విషయాల్లో సంబంధిత అధికారులు, సిబ్బంది నిబంధనల మేరకు పనిచేసి, సకాలంలో సర్వే పనులు పూర్తిచేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ క్షేత్ర పరిశీలన చేశారు. అర్హులైన లబ్ధిదారులను ఏ ప్రాతిపదికన గుర్తిస్తున్నారు, ఏయే అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు, సేకరించిన అంశాలను రిజిస్టర్లలో క్రమపద్ధతిలో నమోదు చేస్తున్నారా అని తహసీల్దార్ జ్యోతిని, ఏఓ జనార్దన్‌ను ప్రశ్నించారు. ఫీల్డ్ వెరిఫికేషన్ వేగంగా పూర్తిచేయాలని, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరిస్తూ సమగ్ర వివరాలు సేకరించాలని, ఆధార్ కార్డు, ప్రజాపాలన దరఖాస్తులు, సామాజిక ఆర్థిక సర్వే వివరాలతో క్షేత్రస్థాయిలో పరిశీలన వివరాలను సరిచూసుకోవాలని ఆదేశించారు. రైతు భరోసాకు సంబంధించి నాలా కన్వర్షన్, భూసేకరణ, లేఅవుట్, వ్యవసాయానికి యోగ్యంగా లేని భూములను సర్వే నెంబర్ల వారిగా పరిశీలించాలని, భూభారతి (ధరణి) పోర్టల్, గూగుల్ మ్యాప్‌ల ఆధారంగా వాస్తవ వివరాలను నిర్దారణ చేసుకోవాలని అధికారుకు సూచించారు. జిల్లా అధికారులు శ్యాంసుందర్,స్వామి కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment