డబ్బులిచ్చుకో.. ఇష్టమొచ్చినట్లు కట్టుకో | - | Sakshi
Sakshi News home page

డబ్బులిచ్చుకో.. ఇష్టమొచ్చినట్లు కట్టుకో

Published Sun, Jan 19 2025 12:25 AM | Last Updated on Sun, Jan 19 2025 12:25 AM

-

భవన నిర్మాణ అనుమతులను టీఎస్‌ బీపాస్‌ ద్వారా జారీ చేయాల్సి ఉంది. స్వీయ మదింపులో 21 రోజుల్లో అనుమతులు వస్తాయి. అదేవిధంగా అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు కొత్త మున్సిపల్‌ చట్టంలో పలు నిబంధనలు రూపొందించారు. అందులో ప్రధానంగా అన్ని ధ్రువీకరణ పత్రాలు సక్రమంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. తేడాలు లేకుండా కచ్చితమైన ఇంటి కొలతలు ఉండాలి. కొలతల్లో తేడాలు ఉన్నా, నిబంధనలు అతిక్రమించినా 25 రేట్లు జరిమానాతో వాస్తవ పన్ను విధిస్తారు. అంతేకాక సెట్‌బ్యాక్‌ నిబంధనను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాలు చేపట్టాలి. స్థలం 200 గజాల్లోపు ఉంటే రోడ్డు వైపు 5 ఫీట్లు, మిగతా మూడు వైపులా 3.5 ఫీట్లు వెనిక్కి స్లాబు వేసుకోవాలి. 100 గజాల్లోపైతే రోడ్డు వైపు 5 ఫీట్లు, మిగిలినా రెండు వైపుల 2 ఫీట్లు వదలాలి. 20 ఫీట్ల రోడ్డు ఉంటే కచ్ఛితంగా 5 ఫీట్లు మున్సిపాలిటీకి గిఫ్టు చేయాల్సిందే. ఇదిలా ఉంటే సెట్‌బ్యాక్‌ స్థలంలో స్లాబు, ప్రహరీ, సెప్టిక్‌ ట్యాంకు ఉండకూడదు. ఇళ్లకు పెట్టే తలుపులు, గేట్లు లోపలివైపునకు తెరుచుకోవాలి.

● ఇలా కాకుండా ఇంటి యజమానులు తీసుకున్న అనుమతులకు భిన్నంగా పై అంతస్తులు నిర్మిస్తున్నారు. అధికారులు తనిఖీకి వచ్చేలోపు నిర్మాణాలు పూర్తవుతున్నాయి. ఈ వ్యవహరంలో సంబంధిత యంత్రాంగం నిర్లక్ష్యంతో పాటు వారిపై రాజకీయ ఒత్తిళ్లు ఉండటంతో చర్యలు తీసుకోకుండా వెనుదిరుగుతున్నారు. దీంతో మున్సిపల్‌ ఆదాయానికి రూ. లక్షల్లో గండి పడుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement