నిబంధనలు బేఖాతరు
గద్వాలటౌన్: ‘ఫైర్ స్టేషన్‌కు సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రి పక్కన ఓ నిర్మాణం చేపట్టారు. వంద గజాల స్థలంలో సెట్‌బ్యాక్ లేకుండా జీ+4 భవనాన్ని నిర్మిస్తున్నారు. నామమాత్రంగా ఇంటి నిర్మాణం కోసం అనుమతి తీసుకుని, బహుళ అంతస్థుల వాణిజ్య సముదాయాన్ని చేపట్టారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టనట్లుగా ఉన్నారు. భవన యజమాని దర్జాగా పనులు పూర్తి కానిచ్చారు’.
ఇలా.. అనుమతులు తీసుకున్న దానికి విరుద్ధంగా కొందరు అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారు. ఎవరికి ఇవ్వాల్సింది వారికిచ్చాం.. ఎవరేమి చేస్తారన్న దీమాతో బిల్డర్లు, కొందరు సొంత ఇంటియజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. అలాంటి నిర్మాణాలపై ఇటీవల పెద్ద సఖ్యలో ఫిర్యాదులు చేస్తున్నా.. అధికారుల నుంచి మీసమెత్తు స్పందన లేదని స్థానికులు వాపోతున్నారు.
గద్వాలలో ఇష్టారాజ్యంగా భవన నిర్మాణాలు
ఎక్కడెక్కడంటే..
మున్సిపల్ పరిధిలో ప్రధానంగా 2, 3, 6వ వార్డుల పరిధిలో సుమారు 40 భవన నిర్మాణాలు అనుమతులకు భిన్నంగా పై అంతుస్తులు కొనసాగుతున్నాయి. వీటితో పాటు ప్రధాన రహదారుల పక్కన సెట్ బ్యాక్ లేకుండా, నివాస అనుమతి తీసుకుని వాణిజ్య దుకాణాలు నిర్మిస్తున్నారు. కొన్ని నిర్మాణాలకు అనుమతులు సైతం తీసుకోలేదని తెలుస్తుంది. వీటితో పాటు శ్రీనివాసకాలనీ, భీంనగర్, పాత హౌసింగ్‌బోర్డు కాలనీలలో నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు జరుగుతున్నాయి. 6, 19, 20వ వార్డుల పరిధిలో ఉన్న రిక్రియేషన్, ఇండస్ట్రీయల్ జోన్ పరిధిలో సుమారు 50 వరకు అనుమతులు లేకుండా నిర్మాణాలు ఉన్నాయి.
చర్యలు తప్పవు
పట్టణంలో టీఎస్ బీపాస్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో పరిశీలన జరుగుతుంది. ఇప్పటికే పలు భవనాలకు నోటీసులు జారీ చేయడంతో పాటు నిర్మాణ పనులను నిలిపివేశాం. నిబంధనలు ఉల్లంఘించిన కొన్ని భవన నిర్మాణాలను గతంలోనే టాస్క్‌ఫోర్సు బృందం కూల్చేసింది. అక్రమ నిర్మాణాలపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటున్నాం.
– దశరథ్, కమిషనర్, గద్వాల
టీఎస్ బీపాస్ నిబంధనలు పాటించని వైనం
మున్సిపల్ ఆదాయానికి గండి
Comments
Please login to add a commentAdd a comment