అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని, అర్హుల జాబితాలో పేర్లు రాని వారు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించిందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డు పధకాల అర్హుల ఎంపిక కోసం బుధవారం కేటీదొడ్డిలో గ్రామసభ నిర్వహించగా.. ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ హాజరై ప్రజలకు సూచనలు చేశారు. అదేవిధంగా రూ.12 కోట్లతో నూతనంగా కేటీదొడ్డి నుండి కుచినెర్ల, కేటీదొడ్డి నుండి గువ్వలదిన్నె వరకు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ నల్లా హనుమంతు, తహసీల్ధార్ సాహెదాబేగం, ఎంపీడీఓ కృష్ణమోహన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment