భూసేకరణ వేగవంతం చేయండి
అలంపూర్: మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణానికి భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు శుక్రవారం సంపత్‌కుమార్, ఆర్డీఎస్ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు నాగరాజుతో మంత్రిని హైదరాబాద్‌లో కలిశారు. ఈ సందర్భంగా ఆర్డీఎస్ రైతులకు సాగునీటిని అందించడానికి వీలుగా తుమ్మిళ్ల లిఫ్టు రెండో దశలో మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరినట్లు చెప్పారు. తుమ్మిళ్లకు అనుసంధానంగా రిజర్వాయర్ల నిర్మాణాలు చేపడితే రైతులకు కలిగే లాభం గురించి మంత్రికి వివరించామన్నారు. రిజర్వాయర్‌ల నిర్మాణంతో భూమి కోల్పోయే రైతులకు అన్యాయం జరగకుండా పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశామన్నారు. అనంతరం ఆర్డీఎస్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌గా సీతారామిరెడ్డిని ప్రతిపాదించాలని మంత్రికి వినతిపత్రం అందజేశామన్నారు. ఈ మేరకు ఆర్డీఎస్ కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారన్నారు. రేషన్ దుకాణాల్లో జరిగే అక్రమాలపై విచారణ చేపట్టాలని, నూతన రేషన్ దుకాణాల సంబంధించి వివరాలు సేకరించాలని మంత్రి అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. సంపత్‌కుమార్‌కు ప్రభుత్వంలో మంచి స్థానం కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డికి, పార్టీ అధిష్టానానికి తెలియజేస్తామన్నారు. అనంతరం జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయ కమిటీ సభ్యులు మంత్రికి అమ్మవారి వార్శిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment