గద్వాల చీరలు, వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు అవసరమైన ఎగుమతులు చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో మాట్లాడుతూ జిల్లాను ఎగుమతి హబ్‌గా మార్చేందుకు, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎగుమతి ప్రోత్సాహక కమిటీని ఏర్పాటు చేసినట్లు వివరించారు. జిల్లాలో ఎగుమతి చేసే ఉత్పత్తుల వివరాలను ఆయా వర్గాల నుంచి సేకరించి వాటిని నివేదిక రూపంలో సమర్పించాలని అధికారులను ఆదేశించారు. గద్వాల చీరలు, పత్తి, వేరుశనగ, మామిడి, బియ్యం ప్రధానంగా అధిక మొత్తంలో ఉత్పత్తి అవుతాయని వీటికి ఎగుమతి చేసేలా ప్రోత్సాహం అందించాలని సూచించారు. వీటన్నింటిని సమన్వయం చేసేలా జిల్లా పరిశ్రమల మేనేజర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. ఉత్పత్తి పెంచడమే కాకుండా మార్కెటింగ్‌ను స్థానికంగా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. టీఎస్– పాస్ కింద పరిశ్రమ స్థాపనకు వచ్చిన దరఖాస్తులన్నింటిని నిశితంగా పరిశీలించి సకాలంలో ఆమోదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment