దిగులుబడి! | - | Sakshi
Sakshi News home page

దిగులుబడి!

Published Thu, Nov 28 2024 12:13 AM | Last Updated on Thu, Nov 28 2024 12:13 AM

దిగుల

దిగులుబడి!

దిగుబడి బాగా తగ్గింది

గత ఖరీఫ్‌ సీజన్‌తో పోలిస్తే ప్రస్తుతం ధాన్యం దిగుబడులు బాగా తగ్గాయి. వాతావరణం, వర్షాల కారణంగా భారీగా నష్టపోయాం. ఎకరానికి 30 బస్తాలకు మించి దిగుబడులు అందడం లేదు. పంటల సాగుకు ఖర్చు బాగా పెరిగింది. పెట్టుబడులు సైతం అందే పరిస్థితి కనిపించడం లేదు.

– కోటిపల్లి రాంబాబు, రైతు, అన్నవరప్పాడు

మండలం వరి సాగు పూర్తయిన

కోతలు

(హెక్టార్లలో) (హెక్టార్లలో)

రాజమండ్రి రూరల్‌ 1,401 1,158

కడియం 2,015 1,250

రాజానగరం 4,128 3,400

అనపర్తి 3,623 3,500

బిక్కవోలు 5,696 5,305

కోరుకొండ 5,199 840

గోకవరం 5,389 1,284

సీతానగరం 5,208 730

రంగంపేట 2,433 1,170

మండలం వరి సాగు పూర్తయిన

కోతలు

(హెక్టార్లలో) (హెక్టార్లలో)

చాగల్లు 3,284 3,021

దేవరపల్లి 3,365 1,560

గోపాలపురం 4,012 840

కొవ్వూరు 4,444 3,857

నిడదవోలు 6,935 3,851

పెరవలి 3,240 1,620

తాళ్లపూడి 3,689 1,674

ఉండ్రాజవరం 4,703 2,607

నల్లజర్ల 3,472 1,214

సాక్షి, రాజమహేంద్రవరం: కర్షకుల ఆశలపై ఖరీఫ్‌ నీళ్లు చల్లింది. పంట సాగు సమయంలో వాతావరణం అనుకూలించడంతో కోటి ఆశలతో వరి సాగు చేపట్టారు. తీరా పంట చేతికొచ్చే సమయంలో దిగుబడులు గణనీయంగా తగ్గడంతో పెట్టుబడులు సైతం అందుతాయా? లేదా..? అన్న మీమాంస కర్షకుల్లో నెలకొంది. గతేడాదితో పోలిస్తే.. ప్రస్తుతం పరిస్థితి మరింత దయనీయంగా మారిందని ఆందోళన చెందుతున్నారు. గత ఖరీఫ్‌ సీజన్‌లో ఎకరానికి 35 నుంచి 40 బస్తాల ధాన్యం దిగుబడి అందితే.. ఈ ఏడాది మాత్రం 30 బస్తాలు దాటే పరిస్థితి కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ పరిణామం రైతుల్లో ఆందోళన నింపుతోంది. పంట సాగుకు పెట్టిన పెట్టుబడులు సైతం అందుతాయా..? లేదా..? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ప్రకృతి విపత్తులతో..

వరి సాగు ప్రారంభంలో వాతావరణం రైతులకు అనుకూలించింది. ఉత్సాహంగా కాడి పట్టారు. జోరుగా పంటల సాగు చేపట్టారు. పంట దిగుబడిపై గంపెడాశలు పెట్టుకున్నారు. చిరుపొట్ట దశలో కురిసిన భారీ వర్షాలు రైతులకు కన్నీళ్లు మిగిల్చాయి. వర్షాల ప్రభావంతో పూత రాలిపోవడం, తాలు గింజలు, మానుపళ్లు ఎక్కువగా రావడం శాపంగా మారింది. వరి పైరు ఈనిక దశలో కురిసిన అధిక వర్షాలకు పూత రాలిపోయింది. కొంతమేర తెగుళ్లు వ్యాప్తి చెందాయి. గింజ గట్టిపడే సమయంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ధాన్యపు గింజలు నొక్కుకుపోయాయి. ఈ పరిణామాలు దిగుబడిపై ప్రభావం చూపాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎకరానికి 30 బస్తాలకు మించి దిగుబడి అందడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికితోడు వరి కోత దశలో సైతం వాతావరణం అనూకూలించకపోవడం మరింత ఆందోళనకు గురి చేసింది. వరి కోతలు మొదలైన సమయం నుంచి తుపాను, అల్పపీడనం, వర్షం అంటూ వాతావరణ హెచ్చరికలు వెలువడుతున్నాయి. మళ్లీ ప్రకృతి ప్రకోపానికి ధాన్యం నీటి పాలు అవుతుందేమో అన్న కంగారులో రైతులు తక్కువ ధరకే ధాన్యం దళారులకు అమ్మేస్తున్నారు.

చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం

రైతులను ఆదుకునే విషయంలో కూటమి ప్రభుత్వం చేతులేత్తేసింది. వర్షం హెచ్చరికల నేపథ్యంలో రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం కనీసం వాళ్ల బాధలను పట్టించుకున్న పాపాన పోలేదు. నామ్‌కేవాస్తే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిందే తప్ప.. ధాన్యం కొనుగోళ్లపై దృష్టి సారించలేదు. వెరసి తామెక్కడ నష్టపోతామో అన్న భయాందోళనతో రైతులు దళారులకు తక్కువ ధరకే విక్రయించేస్తున్నారు. బస్తాకు రూ.1,725 అందాల్సి ఉన్నా.. రూ.100 నుంచి రూ.200 వరకూ తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో రైతు నష్టపోకుండా.. ప్రతి గింజా ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేసింది.

పెరిగిన కోత ఖర్చులు

వరి కోత ఖర్చులు గణనీయంగా పెరిగిపోయాయి. యంత్రాలతో కోతలు, ట్రాక్టర్లతో రవాణా తదితర ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. గతంలో వరి కోత యంత్రానికి గంటకు రూ.2,600 నుంచి రూ.2,800 తీసుకునే వారు. ప్రస్తుతం రూ.2,800 నుంచి రూ.3,000 తీసుకుంటున్నారు. ట్రాక్టర్‌ అద్దె రూ.700 నుంచి రూ.1,000కి పెరగడంతో పెట్టిన పెట్టుబడులు అందుతాయా? లేదా? అన్న ఆందోళన రైతుల్లో నెలకొంది.

ధాన్యం దిగుబడులు ఇలా..

తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌ సీజన్‌లో 72,246 హెక్టార్లలో వరి సాగు చేపట్టారు. ఇప్పటి వరకు 38,818 హెక్టార్లలో కోతలు పూర్తయ్యాయి. 53.8 శాతం కోతలు ముగిసినా.. దిగుబడి మాత్రం 30 బస్తాల లోపే నమోదైంది. కడియం మండలంలో గతంలో 40 బస్తాల దిగుబడి రాగా.. ప్రస్తుతం 30 బస్తాలకే పరిమితమైంది. నిడదవోలు, పెరవలి, కొవ్వూరు మండలాల్లో సైతం 32 బస్తాలుగా నమోదైంది. మెరక భూముల్లో ఎకరానికి 30 నుంచి 35 బస్తాలు, పల్లపు పొలాల్లో 25 నుంచి 30 బస్తాల దిగుబడి వచ్చినట్టు రైతులు చెబుతున్నారు.

● కోనసీమ జిల్లాలో 61,943 హెక్టార్లలో వరి సాగైంది. గతేడాది ఖరీఫ్‌లో 35 బస్తాల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం 32 బస్తాలు దిగుబడి నమోదవుతోంది.

● కాకినాడ జిల్లాలో 2.13 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. గతేడాది ఎకరానికి 40 బస్తాల ధాన్యం దిగుబడి అందింది. ప్రస్తుతం ఎకరానికి 30 బస్తాల దిగుబడి అందుతోంది. గతేడాదికి ప్రస్తుతానికి 10 బస్తాలు తగ్గుముఖం పట్టింది.

గత ఐదేళ్లూ స్వర్ణయుగం

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు స్వర్ణయుగం అని చెప్పుకోవాలి. పంట సాగుకు ముందే రైతు భరోసా పేరుతో రూ.13,500 పెట్టుబడి సాయం అందజేయడంతో ఎలాంటి అప్పులు లేకుండా పంట సాగు చేపట్టారు. సాగుకు అనువైన సమయంలో నీరు విడుదల చేయడంతో గణనీయమైన దిగుబడులు వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లాలో 2021 ఖరీఫ్‌లో 82,695 హెక్టార్లలో వరి సాగు చేపట్టారు. ఎకరానికి (75 కిలోల బస్తా) 28 బస్తాల ధాన్యం దిగుబడి వస్తే.. 2022 ఖరీఫ్‌లో 73,606 హెక్టార్లలో వరి సాగైంది. ఎకరానికి 33 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. 2023లో 73,000 హెక్టార్లలో సాగైతే 40 బస్తాల దిగుబడి వచ్చింది. అంటే ఏడాది వ్యవధిలో ఎకరం పొలానికి 5 నుంచి 10 బస్తాలు వృద్ధి చెందింది.

మాజీ ముఖ్యమంత్రి చొరవతో..

ఏటా మూడు పంటల సాగును ప్రోత్సహించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం. అందుకు అనుగుణంగా 2022 ఖరీఫ్‌లో జూన్‌ 1వ తేదీ నుంచి ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేశారు. సాధారణంగా జూన్‌ 11న విడుదల చేయాల్సి ఉండగా.. పది రోజుల ముందుగా సర్‌ ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజీ నుంచి నీటి విడుదలకు చర్యలు తీసుకున్నారు. ఫలితంగా ప్రకృత్తి విపత్తులు, గోదావరి వరద నుంచి పంటను గట్టెక్కించుకునే అవకాశం కలిగింది. ప్రస్తుతం అలాంటి చర్యలు కనిపించడం లేదు.

పెరవలిలో వరి కోతలు చేపడుతున్న యంత్రం

జిల్లాలో వరి కోతలు ఈ నెల 25నాటికి ఇలా..

కర్షకుల ఆశలపై ఖరీఫ్‌ నీళ్లు

గణనీయంగా తగ్గిన వరి దిగుబడులు

వాతావరణం, వర్షాల

ప్రభావంతో పంటకు తీవ్ర నష్టం

గతేడాది ఎకరానికి

35 నుంచి 40 బస్తాల వరకు..

ప్రస్తుతం 25 నుంచి

30 బస్తాలు మించే పరిస్థితి లేదు

తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 72,246 హెక్టార్లలో వరి సాగు

38,881 హెక్టార్లలో కోతలు పూర్తి

పెట్టుబడులు సైతం దక్కే

పరిస్థితి కనిపించని వైనం

సాగుకు సాయం చేయని

కూటమి ప్రభుత్వం

ఆందోళన చెందుతున్న రైతులు

No comments yet. Be the first to comment!
Add a comment
దిగులుబడి!1
1/1

దిగులుబడి!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement