రాష్ట్ర రగ్బీ జట్టుకు గురజనాపల్లి విద్యార్థులు
24 నుంచి పాట్నాలో ఆల్‌ఇండియా
స్కూల్‌గేమ్స్ పోటీలు
కరప: రాష్ట్ర రగ్బీ జట్టుకు కరప మండలం గురజనాపల్లి పబ్బినీడి పాపారావు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు నలుగురు ఎంపికై నట్టు హెచ్‌ఎం ఎ.సాయిమోహన్ శుక్రవారం తెలిపారు. గత నెల 24, 25 తేదీలలో కాకినాడలోని డీఎస్‌ఏ క్రీడామైదానంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ అండర్–17 బాలికల విభాగంలో జరిగిన రగ్బీపోటీలలో పాఠశాల నుంచి ఎస్.వెంకటవినీల, ఎన్.చాందినిశ్రీ, ఎం.సాయిమౌనిక, పి.దివ్య, పి.మహాలక్ష్మి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జట్టు తరఫున పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరచడంతో జిల్లా జట్టును ప్రథమ స్థానంలో నిలిపారు. ప్రతిభ కనబరచిన సుందర వెంకట వినీలను రాష్ట జట్టుకు ఎంపిక చేశారు. ఫస్ట్ స్టాండ్‌బైగా చాందినిశ్రీని ఎంపిక చేశారన్నారు. అండర్–19 బాలురు, బాలికల విభాగంలో కర్నూలులో జరిగిన రగ్బీపోటీలలో ప్రతిభ కనబరచిన గురజనాపల్లి విద్యార్థులు దడాల బేబీ, నిమ్మకాయల వెంకటేష్ రాష్ట్ర రగ్బీజట్టుకు ఎంపికయ్యారు. బిహార్ రాష్ట్రం పాట్నాలో ఈ నెల 24 నుంచి 30వ తేదీవరకు జరగనున్న ఆల్ ఇండియా స్కూల్‌గేమ్స్ రగ్బీ పోటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రజట్టు తరఫున పాల్గొంటారని పీడీ ఎన్.నాగమల్లేశ్వరరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment