చదువుకు ఇబ్బందిలేకుండా ఉండేది
నా కుమారుడు మధుబాబు తోట గోపాలకృష్ణ మున్సిపల్ హైస్కూల్లో ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాడు. కూలీనాలీ చేసుకునే మాకు చదివించడం ఇబ్బంది అనిపించేది. గత ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాలు అమ్మ ఒడి డబ్బులు నా ఖాతాలో జమయ్యేవి. మొదటి ఏడాది సంక్రాంతి పండగకు ముందు, తర్వాత ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో ఈ డబ్బులు అందించడంతో నా కుమారుడి చదువుకు ఇబ్బంది ఉండేది కాదు.
– బండ లావణ్య, బలుసులపేట, సామర్లకోట
పాఠశాలలో ఆహ్లాదకర వాతావరణం
నాడు–నేడు కార్యక్రమం ద్వారా మా పాఠశాలలో కొత్త తరగతి గదులు నిర్మించి, రంగులు వేసి, సుందరంగా తయారు చేశారు. కొత్త టేబుళ్లు, ఫ్యాన్లు అమర్చారు. పాఠశాల ఆవరణలో పలు రకాలు మొక్కలు వేయడంతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. నాకు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న అనుభూతి కలుగుతోంది.
– మళ్ల దుర్గా సాయి గణేష్, కొక్కొండ రామశేషగిరిరావు పంతులు
ప్రభుత్వోన్నత పాఠశాల, కిర్లంపూడి
Comments
Please login to add a commentAdd a comment